Abn logo
Jun 23 2021 @ 20:22PM

సుశాంత్‌కి కొత్త జీవితాన్ని ఇవ్వండి...

నాలుగేళ్ళ సుశాంత్ ఇప్పుడు కొత్త దినచర్యకు అలవాటు పడ్డాడు. తన సమస్యపై ఆస్పత్రిలో డయాగ్నోసిస్ జరిగినప్పటి నుంచీ ప్రతి 10 రోజులకొకసారి ఎంత నొప్పి కలిగినప్పటికీ ఏ మాత్రం అల్లరి చెయ్యకుండా బాధాకరమైన చికిత్స చేయించుకుంటున్నాడు.


సుశాంత్‌కి సిగ్గు ఎక్కువ. ఎవరితోనూ అంతగా మాట్లాడడు. తను ఇప్పటికే అనువంశికంగా వచ్చిన తలసేమియా మేజర్ అనే రక్తసంబంధమైన సమస్యతో పోరాడుతున్నాడు. 


ఒంట్లో గుచ్చే సూదులు, టెస్టుల బాధ నుంచి కొడుక్కి కాస్తయినా స్వాంతన కలిగించేందుకు సుశాంత్ తల్లి ఎప్పుడూ ఆ చిన్నారిని తన చేతులతో పొదివి పట్టుకుంటుంది. అమ్మ ప్రేమలోని ఆ మాధుర్యమే ఆ బాలుడి జీవితానికి ఆలంబన.

సుశాంత్ అమ్మ కూచి. ఇంట్లో ఉన్నంత సేపూ తను ఎక్కడుంటే అక్కడే తిరుగుతుంటాడని అతని తల్లి గుర్తు చేసుకుంటునే ఉంది. ఇప్పుడు ఆ చిట్టి అడుగుల సవ్వడి వినిపించడం లేదు. ఇప్పుడు తరచూ అలసిపోతున్నాడు, చర్మం పాలిపోయింది. బాధతో ఏడుస్తున్నాడు. "నొప్పి భరించలేక వాడు ఏడుస్తుంటే నేను నిస్సహాయంగా చూడాల్సి వస్తోంది" అని సుశాంత్ తల్లి కన్నీరు పెట్టుకుంటోంది.


సుశాంత్‌కి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనప్పుడు, వెంటనే తన అమ్మానాన్నా ఆస్పత్రికి తీసుకెళ్ళారు. వారి హృదయాలను కలచివేసే దుర్వార్త అప్పుడే తెలిసింది. అదేంటంటే, తమ పిల్లవాడికి తలసేమియా మేజర్ సమస్య ఉందని.


విరాళం ఇచ్చేందుకు ఈ లింకుపై క్లిక్ చెయ్యండి...


సుశాంత్ ఎంతో ఇష్టపడే కార్టూన్ సీరియల్ గురించి చెబుతూ తన అన్న ఎప్పుడు అతని పక్కనే కూర్చుంటాడు. "నా సర్వస్వం ఈ పిల్లలే. నా పెద్ద కొడుకు ఒక్క క్షణం కూడా తమ్ముడిని వదిలి ఉండడు. అన్నయ్య పక్కనుండి కబుర్లు చెబుతుంటే సుశాంత్ మరేమీ మాట్లాడకుండా వింటుంటాడు" అని సుశాంత్ తల్లి గుర్తు చేసుకుంది.


ఈ అన్నదమ్ములిద్దరిదీ విడదీయలేని బంధం. కానీ, ఇప్పుడు తల్లిదండ్రుల మీద పడిన భారం గురించి వారికి తెలీదు.సుశాంత్‌కి చెయ్యవలసిన బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స కోసం సుమారు రూ.20 లక్షలు (27608.08 డాలర్లు) ఖర్చవుతుంది. అన్నయ్యే డోనర్. కానీ, నర్స్ అయిన సుశాంత్ తల్లి అంత బిల్లు భరించే పరిస్థితి ఉందా?


లేనే లేదు.


సుశాంత్ తండ్రి మంజునాథ్ ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాడు. మంజునాథ్‌కి జరిగిన ఒక ప్రమాదం ఆ కుటుంబాన్ని నిస్సహాయ స్థితిలోకి నెట్టేసింది. ఆయన భార్య ప్రస్తుతం సుశాంత్‌కి చికిత్స జరుగుతున్న చోటుకి దగ్గర్లోనే ఉన్న ఒక ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆమె నెల సంపాదన కేవలం ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి మాత్రం సరిపోతుంది.


"నా అనారోగ్యం వల్ల నేను పని చెయ్యలేను... రాత్రీ, పగలు నా భార్యే కష్టపడాల్సి వస్తోంది. మా అబ్బాయి కోసం నా కిడ్నీని అమ్ముకోవడానికి కూడా సిద్ధమే..." అంటూ రోదించాడు మంజునాథ్.


విరాళం ఇచ్చేందుకు ఈ లింకుపై క్లిక్ చెయ్యండి...


మానసికంగా శక్తిమంతుడైన సుశాంత్‌ని తమ ఇంటి వెలుగులా చూసుకుంటుంది ఆ కుటుంబం. చలాకిగా, ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ సాగిపోవలసిన సుశాంత్ జీవితం ఆ తలసేమియా మేజర్ సమస్య వల్ల గాల్లో దీపంలా మారింది.


బోన్ మారో ట్లాన్స్‌ప్లాంట్ సర్జరీకి, చికిత్సకి అయ్యే ఖర్చు తమ తలకు మించిన భారంగా ఉండటంతో ఇప్పుడు సుశాంత్ అమ్మానాన్నలు అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్నారు. పెద్దదిక్కు లేని స్థితిని ఎదుర్కుంటున్న ఈ కుటుంబం మరోసారి అంతటి కష్టాన్ని భరించలేదు.


ఎంతో భవిష్యత్తు... ఇంకెంతో ఎత్తుకు ఎదిగే అవకాశం ఉన్న సుశాంత్ ఉత్సాహవంతమైన జీవితాన్ని అనుభవించాల్సి ఉంది. పెద్ద మనసు చేసుకుని ఆ చిన్నారికి చేయూతనివ్వండి. మంజునాథ్, సుమతి దంపతుల ఇంట్లో మళ్ళీ ఆ చిరునవ్వులు విరబూసేందుకు సహకరించండి.