మొబైల్‌ ఫోన్లు, పరికరాలు ఇవ్వండి

ABN , First Publish Date - 2022-08-18T04:22:50+05:30 IST

గన్‌వాడీ సెంటర్ల నిర్వహణ లో వివిధ రకాల యాప్‌లు ఉప యోగించాల్సి వస్తోంది. సక్రమం గా నిర్వహించకుంటే వేతనాలలో కోత విధిస్తున్నామంటున్నారు.. ఈ ఒత్తిడి భరించలేకున్నాం. ద యచేసి నాణ్యమైన మొబైల్‌ ఫో న్లు, ట్యాబులు ప్రభుత్వమే సరఫ రా చేయాలని అంగన్‌వాడీ కార్య కర్తలు డిమాండ్‌ చేశారు

మొబైల్‌ ఫోన్లు, పరికరాలు ఇవ్వండి
సీడీపీవో సుజాతకు వినతిపత్రం ఇస్తున్న అంగన్‌వాడీ అసోసియేషన్‌ నాయకులు

మదనపల్లె టౌన్‌, ఆగస్టు 17: అంగన్‌వాడీ సెంటర్ల నిర్వహణ లో వివిధ రకాల యాప్‌లు ఉప యోగించాల్సి వస్తోంది. సక్రమం గా నిర్వహించకుంటే వేతనాలలో కోత విధిస్తున్నామంటున్నారు.. ఈ ఒత్తిడి భరించలేకున్నాం. ద యచేసి  నాణ్యమైన మొబైల్‌ ఫో న్లు, ట్యాబులు ప్రభుత్వమే సరఫ రా చేయాలని అంగన్‌వాడీ కార్య కర్తలు డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో సీడీపీవో సుజాతకు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్‌ వాడీ అసోసియేషన్‌ నాయకులు డీఆర్‌ మధురవాణి, జి.గంగాదేవి, భాగ్యమ్మ మాట్లా డుతూ ఇదివరకే ప్రభుత్వం సరఫరా చేసిన మొబైల్‌ఫోన్లు చెడిపోయాయని, కొన్ని మారుమూల గ్రామాల్లో సిగ్నల్స్‌ కూడా అందు కోవడం లేదన్నారు. దీంతో యాప్‌లలో వివరాలు నమోదు చేయడం చాలా ఇబ్బందిగా మారుతోందన్నారు. చాలా మంది అం గన్‌వాడీ కార్యకర్తలు సొంత డబ్బులు వెచ్చించి మొబైల్‌ఫోన్లు కొనలేని పరిస్థితిలో ఉన్నారని, ప్రభుత్వమే వాటిని సరఫరా చేయాలని కోరారు. 15 రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే ప్రభుత్వం ఇది వరకే తమకు ఇచ్చిన ఫోన్లను వాపసు చేస్తామన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T04:22:50+05:30 IST