Abn logo
Apr 13 2021 @ 00:08AM

భూముల వివరాలు తెలియజేయండి

లింగసముద్రం, ఏప్రిల్‌ 12 : మండలంలో ఈ నెల 1వ తేదీ నుంచి జరుగుతున్న ప్రభుత్వ భూముల సర్వే వివరాలను ఈ నెల 20 లోపు తహసీల్దార్‌ కార్యాలయంలో సమర్పించాలని తహసీల్దార్‌ ఆర్‌ బ్రహ్మయ్య సోమవారం చెప్పారు. వీఆర్వోలు, గ్రామ సచివాలయ సర్వేయర్లు మండలంలోని 16 గ్రామ పంచాయతీలలోని 20 రెవెన్యూ గ్రామాల్లోని ప్రభుత్వ భూములను సర్వే చేస్తున్నట్టు ఆయన చెప్పారు. గ్రామాలలో అస్సైన్‌మెంట్‌ పట్టాలు పొంది ఆ భూములను సాగు చేసుకుంటున్నవారు, పట్టాలు పొందిన వారి నుండి కొనుగోలు చేసిన వారు, అలాగే ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వారు వాగులు, వంకలు, డొంకలు, చెరువులు ఆక్రమించుకున్న వారి వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఈ భూముల తనిఖీ విచారణను క్రోడీకరించుకొని కార్యక్రమాన్ని ఎంఆర్‌ఐ పర్యవేక్షించాలన్నారు. ఈ భూముల విచారణ చేస్తున్న అధికారులకు రైతులు కూడా సహకరించాలన్నారు. అలాగే పట్టా భూములను ఆన్‌లైన్‌లో ఒకరి పేరు నుండి మరొకరి పేరుతో నమోదు చేసుకొంటే తగిన పత్రాలతో ఈ కార్యాలయానికి వస్తే సమస్య పరిష్కరిస్తామన్నారు.

Advertisement
Advertisement
Advertisement