ఎన్నికల కమిషన్‌కు డాక్యుమెంట్ ఆధారాలు ఇస్తా: బలరాం నాయక్‌

ABN , First Publish Date - 2021-06-24T03:38:57+05:30 IST

ఎన్నికల్లో పోటీ చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించడంపై కేంద్ర మాజీ మంత్రి

ఎన్నికల కమిషన్‌కు డాక్యుమెంట్ ఆధారాలు ఇస్తా: బలరాం నాయక్‌

హైదరాబాద్: ఎన్నికల్లో పోటీ చేయకుండా  కేంద్ర ఎన్నికల సంఘం  నిషేధం విధించడంపై  కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్  స్పందించారు. తాను జిల్లా కలెక్టర్‌కు అన్ని డాక్యుమెంట్లు అందించానని బలరాం నాయక్ పేర్కొన్నారు. వివరాలు ఇవ్వలేదని తాను పోటీచేయకుండా వేటు వేశారని ఆయన అన్నారు. కోర్ట్ ద్వారా లేదా ఎన్నికల కమిషన్‌కు డాక్యుమెంట్ ఆధారాలు ఇస్తానని బలరాం నాయక్‌ తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు, తన అభిమానులు ఎవరు ఆందోళనపడొద్దని బలరాం నాయక్‌ విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-06-24T03:38:57+05:30 IST