Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 02 Apr 2022 20:12:40 IST

ఒక్క ఛాన్స్ ప్లీజ్... గుజరాత్‌లో కేజ్రీవాల్

twitter-iconwatsapp-iconfb-icon
ఒక్క ఛాన్స్ ప్లీజ్... గుజరాత్‌లో కేజ్రీవాల్

అహ్మదాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్‌ను పాలించేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి ఇక్కడకు వచ్చిన కేజ్రీవాల్ శనివారం సాయంత్రం "తిరంగా గౌరవ్ యాత్ర''పేరుతో రోడ్‌షోలో పాల్గొన్నారు. రథం ఆకారంలో తయారు చేసిన ట్రక్‌ పైనుంచి ప్రజలకు అభివాదం చేస్తూ కేజ్రీవాల్ ముందుకు సాగారు. దీనికి ముందు కేజ్రీవాల్ మాట్లాడుతూ, 25 ఏళ్లుగా అధికారం సాగిస్తుండటంతో బీజేపీ పూర్తి అహంకారంతో ఉందని, ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. తనకు రాజకీయాలు చేయడం రాదని, కానీ అవినీతిని ఎలా అంతం చేయాలో బాగా తెలుసునని అన్నారు. ఢిల్లీలో తాము అవినీతికి చరమగీతం పాడామని, పంజాబ్‌లో భగవంత్ మాన్ కేవలం పది రోజుల్లోనే ఆ పని చేసి చూపించారని కేజ్రీవాల్ అన్నారు. భగవంత్ మాన్ మాట్లాడుతూ, ఢిల్లీ, పంజాబ్‌ల తర్వాత గుజరాత్‌‌ కోసం తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.

తొలుత సబర్‌మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీకి కేజ్రీవాల్, మాన్‌ కలిసి నివాళులర్పించారు. అనంతరం రెండు కిలోమీటర్ల మేర జరిగిన రోడ్‌షోలో పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు చేతిలో త్రివర్ణ పతాకాలు పట్టుకుని స్వాగతం పలికారు. గుజరాత్ ఆప్ నేతలు గాధ్వి, గోపాల్ ఇటాలియా తదితరులు ఈ రోడ్‌షోలో పాల్గొన్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.