జాతరకు అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు స్టాపింగ్‌ ఇవ్వండి

ABN , First Publish Date - 2022-05-22T06:01:37+05:30 IST

కుప్పం పట్టణంలో కొలువైఉన్న ప్రసన్న తిరుపతి గంగ మాంబ జాతర సందర్భంగా కుప్పం రైల్వే స్టేషన్‌లో అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు స్టాపింగ్‌ ఇవ్వాలని సాయి మాతాసేవా ట్రస్టు అధ్యక్షుడు జగదీష్‌బాబు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు విన్నవించారు.

జాతరకు అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు స్టాపింగ్‌ ఇవ్వండి
బెంగళూరులో జగదీష్‌బాబు ఇచ్చిన వినతిపత్రం చదువుతున్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌

కుప్పం, మే 21: పట్టణంలో  కొలువైఉన్న ప్రసన్న తిరుపతి గంగ మాంబ జాతర సందర్భంగా కుప్పం రైల్వే స్టేషన్‌లో అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు స్టాపింగ్‌ ఇవ్వాలని సాయి మాతాసేవా ట్రస్టు అధ్యక్షుడు జగదీష్‌బాబు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు విన్నవించారు. బెంగళూరులో శనివారం ఆయన మంత్రిని కలిశారు. కుప్పంలో వైభవంగా జరిగే గంగ జాతరకు మూడు రాష్ట్రాలనుంచి భక్తులు వేలసంఖ్యలో వస్తారని, వారి సౌకర్యార్థం షిర్డీసాయి ఎక్స్‌ప్రెస్‌తోపాటు మిగిలిన ఎక్స్‌ప్రెస్‌లను కనీసం రెండు నిమిషాల పాటు స్టాపింగ్‌ ఇవ్వాలని కోరారు. అలాగే రాంనగర్‌ - పుష్‌పుల్‌ రైలును పునరుద్ధరించాలని, కుప్పానికి అదనపు పుష్‌పుల్‌ సర్వీసును ఉదయం 8 గెంటలకు బెంగళూరుకు నడపాలని విన్నవించారు. రైల్వే మంత్రితోపాటు పశ్చిమ రైల్వే జనరల్‌ మేనేజరు సంజీవ్‌ కిషోర్‌, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ కుసుమ రఘునాథ్‌కు కూడా వినపతిపత్రం అందజేశారు.  

Updated Date - 2022-05-22T06:01:37+05:30 IST