కర్మబంధనం

ABN , First Publish Date - 2022-08-19T05:30:00+05:30 IST

‘‘మరణం లేనిది, నాశనం లేనిది చైతన్యం’’ అని అర్జునుడికి శ్రీ కృష్ణుడు ‘సాంఖ్య యోగం’ గురించి వివరిస్తున్న సందర్భంలో తెలిపాడు కర్మ బంధనం గురించి, యోగం గురించి చెప్పాడు. ‘యోగం’ అంటే ‘కలయిక’ అని అర్థం.

కర్మబంధనం

 గీతాసారం


‘‘మరణం లేనిది, నాశనం లేనిది చైతన్యం’’ అని అర్జునుడికి శ్రీ కృష్ణుడు ‘సాంఖ్య యోగం’ గురించి వివరిస్తున్న సందర్భంలో తెలిపాడు కర్మ బంధనం గురించి, యోగం గురించి చెప్పాడు. ‘యోగం’ అంటే ‘కలయిక’ అని అర్థం. అయితే ఈ పదాన్ని అనేక అర్థాల్లో ఉపయోగిస్తారు. దాన్ని ‘సమస్థితి’కి పర్యాయంగా శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. ‘‘ఆ స్థితిలోకి చేరుకున్నవారి విజయాలు, వైఫల్యాలతో సంబంధం ఉండదు. అలాంటివారు సంతోషాన్నీ, బాధనూ, గెలుపునూ, ఓటమినీ, లాభాన్నీ, నష్టాన్నీ ఒకేలా చూస్తార’’న్నాడు.


‘కర్మబంధనం’ అంటే మనం చేసిన కర్మలు, మన లోపలి నుంచి, బయటి నుంచి పొందిన స్పందనలు మిగిల్చిన సంతోషకరమైన లేదా బాధాకరమైన ముద్రలు లేదా గుర్తులు. ఈ ముద్రలు మన ప్రవర్తనను అపస్మారక స్థాయి నుంచి నడిపిస్తాయి. కాబట్టి యోగం ద్వారా కర్మబంధనం నుంచి విముక్తి కావాలని కృష్ణుడు సూచించాడు.   ఆనందాన్ని, లాభాన్ని అందించే ముద్రలను అంటిపెట్టుకొని ఉండడం మన  సహజ లక్షణం. ఈ ముద్రలు మనలో ఎంత లోతుగా పాతుకుపోతే, అంత తీవ్ర స్థాయిలో... లౌకికమైన విషయాలను మనం అంటిపెట్టుకొని ఉంటాం, తద్వారా విరక్తి ఏర్పడుతుంది..


ఈ ముద్రలు ఎంత బలమైనంటే... వాటిని రాయి, ఇసుక, నీటి మీద రాతలతో పోల్చవచ్చు. రాతిపై చెక్కిన రాత లోతుగా ఉంటుంది. చాలా కాలం పాటు మనపై అది ప్రభావం చూపిస్తుంది. ఇసుకలో రాసిన రాత తక్కువకాలమే ఉంటుంది. ఇక నీటి మీద రాసిన రాత తక్షణం చెరిగిపోతుంది. ‘కర్మ బంధనం’ అనే ముద్రలు నీటి మీద రాసిన రాతలా ఉంటే అది మనల్ని ప్రభావితం చెయ్యలేదనీ, ఇబ్బంది పెట్టలేదనీ కృష్ణుడు తెలిపాడు.


కె.శివప్రసాద్‌, ఐఎఎస్‌


Updated Date - 2022-08-19T05:30:00+05:30 IST