బాలికలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-09-25T05:11:31+05:30 IST

కౌమార దశలో ఉన్న బాలికలు పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ అన్నారు.

బాలికలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి
విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌

సిద్దిపేట కల్చరల్‌/సిద్దిపేట అర్బన్‌, సెప్టెంబరు 24: కౌమార దశలో ఉన్న బాలికలు పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ అన్నారు. శనివారం శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సంప్రదాయ బొడ్డెమ్మ పండుగను ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కౌమార దశలో ఉన్న బాలికలు మంచి పౌష్టికాహారం తీసుకుని రక్తహీనత లోపాన్ని అధిగమించాలన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులారాజనర్సు, అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ మాట్లాడుతూ పౌష్టికాహారాన్ని తీసుకుని ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి రాంగోపాల్‌రెడ్డి, గైనకాలజిస్టు రజిని, కౌన్సిలర్‌ పూర్ణిమ ఎల్లం, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, బాలికలు పాల్గొన్నారు. అలాగే సిద్దిపేట అర్బన్‌ మండలంలోని మలబార్‌ గోల్డ్‌ షోరూంలో నిర్వహించిన జ్యువెలరీ ఫెస్ట్‌ను జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల ప్రారంభించారు. 

Updated Date - 2022-09-25T05:11:31+05:30 IST