బాలికలదే పైచేయి..

ABN , First Publish Date - 2022-07-01T06:36:17+05:30 IST

పదోతరగతి ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఎస్సెస్సీ ఫలితాల్లో మొత్తం జిల్లా ఉత్తీర్ణత శాతం 91.37 శాతంగా ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ జగన్మోహన్‌ రెడ్డి తెలి పారు.

బాలికలదే పైచేయి..
సిద్దార్థ విద్యాసంస్థల విద్యార్థులను అభినందిస్తున్న యాజమాన్యం

- ఎస్సెస్సీ ఫలితాల్లో ఉత్తీర్ణత 91.37శాతం 

- జిల్లాకు 21వ స్థానం

జగిత్యాల అర్బన్‌, జూన్‌ 30: పదోతరగతి ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఎస్సెస్సీ ఫలితాల్లో మొత్తం జిల్లా ఉత్తీర్ణత శాతం 91.37 శాతంగా ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ జగన్మోహన్‌ రెడ్డి తెలి పారు. ఈ పరీక్షలకు జిల్లాలో 11,786 మంది విద్యార్థులు పరీక్షలు రాయ గా, 10,769 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 6,135 మంది బాలురు ఉండగా, 5454 మంది ఉత్తీర్ణత సాధించారు. 5651 మంది బాలికలకు గానూ 5,315 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర ఉత్తీర్ణత శాతం 88.9 శాతం కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 94.05గా నమోదైంది. కరోనాకు ముందు ఎస్సెస్సీ ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో హ్యాట్రిక్‌ విజ యాన్ని అందుకున్న జగిత్యాల జిల్లా నేడు ఉత్తీర్ణత శాతంలో 21వ స్థానానికి పడిపోవడం గమనార్హం.

 - జగిత్యాల అర్బన్‌ పరిధిలో..

జగిత్యాల అర్బన్‌ పరిధిలో మొత్తం 17 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 519 మంది విద్యార్థులు ఈ ఎస్సెస్సీ పరీక్షకు హాజరుకాగా, 415 మంది ఉత్తీర్ణత సాధించినట్లు అర్బన్‌ ఎంఈవో గాయత్రి తెలిపారు. ఇందులో 208 బాలురకు గానూ 200 మంది, 311 మంది బాలికలకు గానూ 215 మంది ఉత్తీర్ణులయ్యారని ఆమె తెలిపారు. పట్టణ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 79.96 శాతం మొత్తం ఉత్తీర్ణత సాధించారని ఆమె పేర్కొన్నారు. జగిత్యాల గర్ల్స్‌ హైస్కూల్‌ విద్యార్థిని ధరణి 10 జీపీఏ సాధించి అర్బన్‌ మండల టాపర్‌గా నిలవగా, జడ్పీహెచ్‌ఎస్‌ ధరూర్‌ పాఠశాలకు చెందిన విద్యార్థి కె.సుమంత్‌ 9.8 జీపీఏ సాధించి రెండో స్థానంలో, జడ్పీహెచ్‌ ఖాజీపుర విద్యార్థిని రింషా అమీన్‌, జడ్పీహెచ్‌ఎస్‌ పురాణిపేట కు చెందిన కృష్ణప్రియ, శరణ్య 9.7 జీపీఏ సాధించారు. 17 పాఠశాలల్లో 10 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించగా, 29మంది విద్యార్థులు 8.5పైగా జీపీఏ సాధించినట్లు ఎంఈవో గాయత్రి తెలిపారు.

- శ్రీచైతన్య హైస్కూల్‌లో...

జిల్లాలోని శ్రీచైతన్య హైస్కూల్‌ విద్యార్థులు  134 మంది ఉండగా, 64మంది విద్యార్థులు 9జీపీఏ పైగా సాధించారు. ఆరుగురు విద్యార్థులు 10జీపీఏ, 14మంది 9.8, 04గురు 9.7, 08 మంది 9.5, 08 మంది 9.3, ఆరుగురు 9.2, 18 మంది 9.0 జీపీఏ సాధించారు.

- శ్రీనిధి పాఠశాలలో..

జగిత్యాలలోని శ్రీనిధి హైస్కూల్‌ విద్యార్థులు హవాను సాగించారు. పాఠశాలకు చెందిన అడువాల సాహితి, తిరునగరి హాసిని, జునేరా సమీ న్‌, కొలగాని సాయి ప్రీతమ్‌, మకిలి నిత్య జీవన్‌, వడ్లగట్ల రజనీష్‌, ఆశిరెడ్డి అనిరుద్‌రెడ్డి 10 జీపీఏ సాధించగా, 11 మంది విద్యార్థులు 9.8 జీపీఏ, 30మంది 9జీపీఏకు పైగా సాధించారు. దీంతోపాటు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. 

- సిద్దార్థ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్‌లో..

ఎస్సెస్సీ ఫలితాల్లో జగిత్యాల పట్టణానికి చెందిన సిద్దార్ధ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్సిస్టిట్యూషన్స్‌ విద్యార్థులు విజయఢంకా మోగించారు. 2021-22 విద్యా సంవత్సరం పరీక్ష ఫలితాల్లో జ్యోతి, మానస, సూర్య గ్లోబల్‌ పాఠశాల విద్యార్థులు 36 మంది 10 జీపీఏ సాధించగా, మరో 46 మంది విద్యా ర్థులు 9.8 జీపీఏ సాధించారు. వంద శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.    

Updated Date - 2022-07-01T06:36:17+05:30 IST