‘పది’లో బాలికలదే పైచేయి

ABN , First Publish Date - 2022-07-01T06:15:23+05:30 IST

పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షా ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. జోగుళాంబ గద్వాల జిల్లా 85.57 శాతం ఉత్తీర్ణతతో, రాష్ట్రంలో 31వ స్థానంలో నిలిచింది.

‘పది’లో బాలికలదే పైచేయి
గద్వాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థులను అభినందిస్తున్న హెడ్‌మాస్టర్‌, ఉపాధ్యాయులు

- జోగుళాంబ గద్వాల జిల్లాకు 31వ స్థానం 

- 32 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత

గద్వాల టౌన్‌, జూన్‌ 30 : పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షా ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. జోగుళాంబ గద్వాల జిల్లా 85.57 శాతం ఉత్తీర్ణతతో, రాష్ట్రంలో 31వ స్థానంలో నిలిచింది. మే ఆరు నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. జిల్లా నుంచి మొత్తం 7,920 మంది విద్యార్థులు పరీక్ష రాయ గా, 6,783 (85.64 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 4,000 మంది బాలురు పరీక్ష రాయగా, 3,311 (82.78 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.  బాలికలు 3,920మంది పరీక్ష రాయగా, 3,472 (88.57 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.


178 మంది విద్యార్థులకు 10/10 జీపీఏ 

జిల్లాలోని 32 ఉన్నత పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణతను సాధించాయి. వాటిలో 14 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు కాగా, 18 ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నా యి. ధర్మవరం (ఇటిక్యాల మండలం), కేటీదొడ్డిలోని కస్తూర్బా బాలికల విద్యాల యాలతో పాటు గట్టులోని షెడ్యూలు కులాల బాలికల గురుకుల, కేటీదొడ్డిలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకు లాలు వందశాతం ఉత్తీర్ణత సాధించిన వాటిలో ఉన్నా యి. జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలకు చెందిన 178 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధిం చారని జిల్లా విద్యాశాఖాధికారి మహ్మద్‌ సిరాజుద్దీన్‌ తెలిపారు.  మండలాల వారీగా ప్రకటించిన ఫలితాల్లో అలంపూరులో 94.91 శాతం,  ధరూరులో 73.01 శాతం, గద్వాలలో 85.94 శాతం, గట్టులో 89.34 శాతం, అయిజలో 86.32 శాతం, ఇటిక్యాలలో 93.49 శాతం, కేటిదొడ్డిలో 83.28 శాతం,  మల్దకల్‌లో 71.90 శాతం, రాజోలిలో 70.73 శాతం, ఉండవెల్లిలో 88.10 శాతం, వడ్డేపల్లిలో 79.07 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు వివరించారు. 


ధరూరు : మండల కేంద్రంతో పాటు ఉప్పేరు, మార్లబీడు, రేవులపల్లి తదితర పాఠశాలల విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించారు. ధరూరు మండలంలో 49 శాతం మంది విద్యార్థులు 9.5, ఉప్పేరులో 40 శాతం మంది 9.2, మార్లబీడులో 92శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మండల విద్యాధికారి సురేష్‌ తెలిపారు. 


ఎర్రవల్లి చౌరస్తా : పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఇటిక్యాల మండలం బీచుపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు ముగ్గురు 10/10 గ్రేడ్‌ సాధించారు. పెబ్బేరు మండలం మల్లాయిపల్లి గ్రామానికి చెందిన వలస కూలీ జైహింద్‌ కుమారుడు బద్రి 10/10 సాధించాడు. మరో 70 మంది విద్యార్థులు తొమ్మిది పాయింట్లకు పైగా సాధించారు. వారిని ప్రిన్సిపాల్‌ వీరారెడ్డి అభినందిం చారు. ఎర్రవల్లి చౌరస్తాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారని ప్రత్యేకాధికారి అసియాబేగం తెలిపారు.


ఉండవల్లి : మండల పరిధిలోని పుల్లూరు మహాత్మ జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తమ పలితాలు సాధిం చారు. 76 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అంద రూ పాసైనట్లు ప్రిన్సిపాల్‌ దేవానందం తెలిపారు. ఉండ వల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో 102 మంది విద్యార్థులకు గాను 79 పాస్‌ అయ్యారు. పుల్లూరు జడ్పీఎస్‌ఎస్‌ విద్యా ర్థులు 31 మంది పరీక్షలు రాయగా 26 మంది పాసయ్యారు. తక్కశిల జడ్పీహెచ్‌ఎస్‌లో 41 విద్యార్థుల కు గాను 30 మంది పాస్‌ అయ్యారు. బైరాపురం జడ్పీహెచ్‌ఎస్‌లో 26 మందికి, 24 మంది ఉత్తీర్ణత సాధించారు. బొంకూర్‌ జడ్పీహెచ్‌ఎస్‌లో 40 మందికి గాను, 36 మంది పాస్‌ అయ్యారు. కేజీబీవీలో 98 శాతం, అలంపూర్‌ మైనారిటీ గురుకులంలో 94 శాతం మంది పాస్‌ అయ్యారు. 


ఇటిక్యాల : పదవ తరగతి ఫలితాల్లో ఇటిక్యాల మం డల విద్యార్థులు 90.98 శాతం ఉత్తీర్ణత సాధించారని ఎంఈవో రాజు తెలిపారు. మండలంలోని 14 జడ్పీహెచ్‌ఎస్‌లలో 371 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 333 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయినట్లు తెలిపారు. కోదండాపురం, ఎర్రవల్లిచౌరస్తాలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయన్నారు. మండలంలో మూడు గురుకుల పాఠశాలలు ఉండగా అందులో 243 మంది మంది పరీక్షకు హజరు కాగా 240 మంది విదార్థులు (98.76 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఇటిక్యాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 80 మందికి గాను 78 మంది ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ తిరుపతయ్య తెలిపారు. 


మానవపాడు : మండలంలోని ప్రభుత్వ పాఠశాలల కు చెందిన పదవ తరగతి విద్యార్థులు ఫలితాల్లో ప్రతి భను చాటారు. చెన్నిపాడు జడ్పీహెచ్‌ఎస్‌లో 26 మందికి గాను 21 మంది ఉత్తీర్ణులు కాగా, జల్లాపురం జడ్పీహెచ్‌ఎస్‌లో 58 మందికి గాను 53 మంది ఉత్తీర్ణుల య్యారు. మానవపాడు కస్తూర్బాలో 37 మందికిగాను 34 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. మానవపాడు జడ్పీహెచ్‌ఎస్‌లో 96 మందికి గాను 79 మంది ఉత్తీర్ణులయ్యారు. 


అయిజ : అయిజ మండలంలోని 12 ప్రభుత్వ పాఠశాలల్లో 603 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయగా, 492 మంది (82శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఉర్దూ మీడియంలో పరీక్ష రాసిన ఒకే ఒక్క విద్యార్థి ఉత్తీర్ణుడయ్యాడని మండల విద్యాధికారి నర్సింహులు తెలిపారు. 


రాజోలి : పదవ తరగతి ఫలితాల్లో రాజోలి కస్తూర్బా పాఠశాల విద్యార్థులు 87.5 శాతం ఉత్తీర్ణత సాధించారు. జడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు 72.82 శాతం ఉత్తీర్ణత సాఽధించారు. మండలంలో 276 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 201 మంది ఉత్తీర్ణత సాధించారని ఎంఈవో నర్శింహులు తెలిపారు. 

Updated Date - 2022-07-01T06:15:23+05:30 IST