పశ్చిమ గోదావరి: జిల్లాలోని ద్వారకా తిరుమల మండలంలోని తిరుమలపాలెం గ్రామంలో పసిపిల్లలతో కలిసి ఇద్దరు బాలికలు ఆందోళన చేశారు. గ్రామానికి చెందిన సురేంద్ర, సుధాకుమార్ అనే అన్నదమ్ములు ప్రేమ పేరుతో తమను మోసం చేసి మరో పెళ్లికి సిద్ధమవుతున్నారని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ అన్నదమ్ముల ఇంటి ముందు వారు బైఠాయించారు.