ఓ అమ్మాయి కోసం ఇద్దరబ్బాయిలు కొట్టుకోవడం సాధారణ విషయమే.. ఓ అబ్బాయి కోసం ఇద్దరమ్మాయిలు కోట్టుకోవడం కూడా అప్పుడప్పుడు చూస్తుంటాం.. అయితే ఇక్కడ ఓ అబ్బాయి కోసం ఏకంగా నలుగురు యువతులు కొట్టుకున్నారు.. ఓ షాపింగ్ మాల్లో అందరూ చూస్తుండగా ఈ ఫైటింగ్ జరగడం విశేషం.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బీహార్‌లోని ముజఫరాపూర్‌లోని మోతిజ్హీల్ ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్లో నలుగురు అమ్మాయిలు గొడవపడ్డారు. ముందుగా ఇద్దరు అమ్మాయిలు కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మరో యువతి వారిని విడదీసేందుకు వచ్చి.. ఆ తర్వాత ఆమె కూడా వారితో ఫైటింగ్ చేసింది. ఆ తర్వాత మరో యువతి కూడా ఆ గొడవలో జాయిన్ అయింది. అందరూ జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. వారిని విడదీసేందుకు ఓ వ్యక్తి వచ్చి వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించాడు.
ఆ గొడవంతా ఓ యువకుడి కోసమని తెలుసుకుని అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఆ యువకుడు ఆ గొడవ చూస్తూ కామ్‌గా ఉండిపోయాడు. వీరి ఫైటింగ్‌ను షాపింగ్‌మాల్‌కు వచ్చిన వారు ఆసక్తిగా తిలకించారు. కొందరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై కొందరు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదని స్థానిక పోలీసులు తెలిపారు.