Abn logo
Aug 9 2021 @ 16:59PM

కాలువలో పడి బాలికలు మృతి

కడప: ప్రమాదవశాత్తు కాలువలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు. రాజుపాలెం మండలం వాసుదేవ పురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు పశువుల మేత కోసం వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సమీపంలో ఉన్న కేసీ కాలువలో పడి మృతి చెందారు. మృతులు ఇరగం రెడ్డి రాధ (9), మల్లీశ్వరి (12)గా గుర్తించారు.