ఇద్దరమ్మాయిలు వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించిన తండ్రీకొడుకులు.. విషయం ఏంటని ఆరా తీస్తే..

ABN , First Publish Date - 2022-04-14T18:35:16+05:30 IST

సమాజంలో గౌరవంగా బతుకుతున్న తండ్రీకొడుకులపై ఇద్దరమ్మాయిలు వల వేశారు..

ఇద్దరమ్మాయిలు వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించిన తండ్రీకొడుకులు.. విషయం ఏంటని ఆరా తీస్తే..

సమాజంలో గౌరవంగా బతుకుతున్న తండ్రీకొడుకులపై ఇద్దరమ్మాయిలు వల వేశారు.. వారి పక్కింట్లోనే అద్దెకు దిగి వారితో పరిచయం పెంచుకున్నారు.. యువకుడిని ట్రాప్ చేసేందుకు ప్రయత్నించారు.. ఆ యువకుడు వారి ట్రాప్‌లో పడకపోవడంతో బెదిరింపులకు దిగారు.. తమకు రూ.10 లక్షలు ఇవ్వకుంటే అత్యాచారం కేసు పెడతామని బెదిరించారు.. దీంతో ఆ తండ్రీకొడుకులు పోలీసులను ఆశ్రయించారు. 


రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన 60 ఏళ్ల కైలాష్ తన కొడుకు విపుల్‌తో కలిసి నివసిస్తున్నాడు. విపుల్‌కు 2018లో వివాహం కాగా 2020లో భార్య చనిపోయింది. అప్పట్నుంచి విపుల్ తండ్రితో పాటు కలిసే ఉంటున్నాడు. వారి పక్కింట్లోకి గతేడాది నవంబర్‌లో రాధిక, ఏక్తా అనే అక్కాచెల్లెళ్లు దిగారు. వారు మంచి మాటలతో కైలాష్, విపుల్‌లకు దగ్గరయ్యారు. తరచుగా వారి ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. విపుల్‌ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకునేందుకు రాధిక స్కెచ్ వేసింది. అయితే తాను పెళ్లికి సిద్ధంగా లేనని విపుల్ చెప్పడంతో రాధిక ఫైర్ అయింది. 


రాధిక, ఏక్తా కలిసి కైలాష్, విపుల్‌తో గొడవకు దిగారు. రాధికను పెళ్లి చేసుకోవాలని, లేదంటే తమకు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే విపుల్‌పై అత్యాచారం కేసు పెడతామని బెదిరించారు. దీంతో కైలాష్, విపుల్ పోలీసులను ఆశ్రయించి రాధిక, ఏక్తాపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-04-14T18:35:16+05:30 IST