పది ఫలితాల్లో బాలికల సత్తా

ABN , First Publish Date - 2022-07-01T05:58:31+05:30 IST

పది ఫలితాల్లో బాలికల సత్తా

పది ఫలితాల్లో బాలికల సత్తా

  • 90.42శాతం మంది ఉత్తీర్ణత
  • 93.64శాతం మంది బాలికలు పాస్‌
  • 55 పాఠశాలల్లో శతశాతం ఫలితాలు
  • 25 ప్రభుత్వ పాఠశాలల్లోని 130 మంది విద్యార్థులకు 10జీపీఏ


రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో వికారాబాద్‌ జిల్లా 24వ స్థానంలో నిలిచింది. జిల్లాలో పరీక్షలు రాసిన బాలికల్లో 93.64శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు 6.38శాతం మంది ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. ఇదిలా ఉంటే గతంలో కంటే ఈ సారి జిల్లా విద్యార్థులు కాస్త మెరుగైన ఫలితాలు సాధించారు. కాగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా విద్యార్థులు 86.31శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 30వ స్థానంలో నిలిచింది.


వికారాబాద్‌, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పదో తరగతి పరీక్ష ఫలితాల్లో వికారాబాద్‌ జిల్లా 90.42శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 24వ స్థానంలో నిలిచింది. మే నెలలో నిర్వహించిన టెన్త్‌ పరీక్షలకు జిల్లాలో 14,226 మంది విద్యార్థులు హాజరు కాగా 12,863 మంది పాసయ్యారు. బాలురు 7,180మంది హాజరు కాగా 6,265 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 7,046 మంది పరీక్షలు రాయగా 6,598 మంది పాసయ్యారు. బాలుర ఉత్తీర్ణత 87.26 శాతం, బాలికల ఉత్తీర్ణత 93.64శాతం నమోదైంది. బాలుర కంటే బాలికలు 6.38శాతంతో పైచేయి సాధించారు. జిల్లాకు సంబంధించి పదో తరగతి పరీక్షా ఫలితాలు గతంలో కంటే మెరుగుపడ్డాయి. 2018లో 75.39శాతం ఉత్తీర్ణతతో 26వ స్థానంలో, 2019లో 88.82శాతంతో 25వ స్థానంలో నిలిచింది. 


  • 25 ప్రభుత్వ పాఠశాలల్లో అందరూ పాస్‌!


ఈ సారి జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో 55పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. వాటిల్లో 25 ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు ఉన్నాయి. వంద శాతం ఫలితాలు సాధించిన వాటిలో 17 జెడ్పీ, ఆశ్రమ 2, ఎంజేపీటీబీసీ 2, టీఎ్‌సఆర్‌ఈఐఎస్‌, టీటీడబ్ల్యుఆర్‌ఈఐఎస్‌, మైనార్టీ, ఎయిడెడ్‌ పాఠశాలలు ఒక్కోటి ఉన్నాయి. అలాగే 30 ప్రైవేట్‌ పాఠశాలల్లో మొత్తం మంది పాసయ్యారు. తాండూరులో 12, వికారాబాద్‌లో 7, నవాబ్‌పేట్‌లో 5, పరిగిలో 5, కొడంగల్‌లో 4, పెద్దేముల్‌లో 3, బొంరా్‌సపేట్‌లో 2, చౌడాపూర్‌లో 2,  ధారూరులో 2, దౌ ల్తాబాద్‌లో 2, మర్పల్లిలో 2, మోమిన్‌పేట్‌లో 2, యాలాల్‌లో 2, బంట్వారం, బషీరాబాద్‌, కోట్‌పల్లి, కులకచర్ల, పూడూరు మండలాల్లో ఒక్కో ఉన్నత పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. సల్బత్తాపూర్‌, మైల్వార్‌, చాకలిపల్లి, కెరెల్లి, కుదురుమళ్ల, యెన్నారం, మందీపల్‌, కొంశెట్‌పల్లి, దేవరంపల్లి, అక్నాపూర్‌, నారేగూడ, గం గ్యాడ, రాపోల్‌, ఽఅడికిచర్ల, రాస్నం, ధారూరు బాలికలు, ఇందూరు ఉర్దూ మీడియం పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించాయి. కొడంగల్‌ టీటీడబ్ల్యుఆర్‌ఎస్‌ బా లురు, తాండూరు టీఎ్‌సఆర్‌ఎస్‌ బాలికలు, బురాన్‌పూర్‌ ఎంజేపీటీబీసీడబ్ల్యుఆర్‌ బాలికలు, వికారాబాద్‌ టీఎస్‌ మైనార్టీ గురుకుల బాలికలు, బొట్లవానితండా, కొత్తపల్లి ఎస్టీ గురుకుల పాఠశాలలు, చంద్రకల్‌లోని మెథడిస్ట్‌ ఎయిడెడ్‌ పాఠశాల శతశాతం ఉత్తీర్ణత సాధించాయి.


  • 130 మందికి 10 జీపీఏ


జిల్లాలో 130మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. బాలికలే ఎక్కువ మంది ఉన్నారు. తాండూరులో 49 మం ది, వికారాబాద్‌లో 29, పరిగిలో 20, పూడూరులో 11, కొడ ంగల్‌లో 6, బంట్వారంలో 5, పెద్దేముల్‌లో 3, బొంరా్‌సపేట్‌లో 2, యాలాల్‌లో 2, కోట్‌పల్లి, కులకచర్ల, మోమిన్‌పేట్‌ల్లో ఒక్కో విద్యార్థి చొప్పున 10 జీపీఏ సాధించారు. 9.8 జీపీఏ 235 మంది, 9.7జీపీఏ 277, 9.5జీపీఏ 343, 9.3 జీపీఏ 402, 9.2జీపీఏ 417, 9జీపీఏ 507, 8.8 జీపీఏ520, 8.7జీపీఏ 542, 8.5జీపీఏ 579, 8.3జీపీఏ 567, 8.2జీపీఏ 565, 8జీపీఏ 630 మంది విద్యార్థులు సాధించారు.


  • టెన్త్‌ ఫలితాల్లో కోట్‌పల్లి మండలం అగ్రస్థానం


జిల్లాలో కోట్‌పల్లి మండలం 95.53శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో అగ్రస్థానంలో నిలిచింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు.


  • మేడ్చల్‌ జిల్లాలో 86.31శాతం ఉత్తీర్ణత


మేడ్చల్‌, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడ్చల్‌ జిల్లాలో గురువారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 86.31శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ మేరకు డీఈవో విజయకూమారి వెల్లడించారు. జిల్లాలో 1001 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాల విద్యార్థులు 42,968 మంది టెన్త్‌ పరీక్షలు రాశారు. వారిలో 37,084 మంది పాసయ్యారు. 22,455 మంది బాలురు పరీక్షలు రాయగా  18,731 మంది, బాలికలు 20,513 మంది పరీక్షలు రాయగా 18,353 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 83.42శాతం, బాలికలు 89.47శాతం మంది పాసయ్యారు. ఓవరాల్‌గా 86.31శాతం మంది పాసైనట్లు డీఈవో పేర్కొన్నారు. కరోనా వల్ల గత రెండేళ్లు పరీక్షలతో సంబంధం లేకుండా విద్యార్థులందరినీ పాస్‌ చేశారు. ఈ సంవత్సరం జరిగిన తరగతుల ప్రకారం 70శాతం సిలబ్‌సతో పరీక్షలు రాశారన్నారు.

Updated Date - 2022-07-01T05:58:31+05:30 IST