నా భార్య చాలా మంచిది.. నా చావుకు నా ప్రియురాలే కారణం.. సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు వెల్లడించిన పెయింటర్!

ABN , First Publish Date - 2022-05-04T22:55:27+05:30 IST

భార్య ఉండగానే

నా భార్య చాలా మంచిది.. నా చావుకు నా ప్రియురాలే కారణం.. సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు వెల్లడించిన పెయింటర్!

రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన అతను ఒక పెయింటర్.. పదిహేనేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న అతనికి ఓ 13 ఏళ్ల కూతురు ఉంది.. భార్య ఉండగానే అతను మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. ఆమె బంధువుల నుంచి రెండు లక్షలు అప్పుగా తీసుకున్నాడు.. తిరిగి చెల్లించలేకపోయాడు.. దీంతో వారు అతని కూతురిని తీసుకెళ్లిపోయారు.. పెళ్లి కాని ఓ వ్యక్తికి ఆ బాలికను ఇచ్చి పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ పెయింటర్ ఆత్మహత్య చేసుకున్నాడు.. తన చావుకు తన ప్రేయసి, ఆమె బంధువులు కారణమని ఆరోపించాడు. 


`నా పేరు విష్ణు చౌహాన్. నా ప్రేయసి రీనా గత మూడేళ్లుగా నన్ను ఎంతగానో ఉపయోగించుకుంది. ఆమె బంధువుల నుంచి డబ్బులు అప్పు తీసుకుని ఆమె కోసమే ఖర్చు పెట్టాను. వడ్డీ ఎక్కువ కావడంతో తిరిగి చెల్లించలేకపోయాను. దాంతో రీనా సోదరుడు నా కూతురిని తీసుకెళ్లిపోయాడు. ఏడాదిగా తన దగ్గరే పెట్టుకున్నాడు. మైనారిటీ కూడా తీరని నా కూతురిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. అతడిపై నేను చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ప్రేమ పేరుతో రీనా నన్ను అడ్డుకుంది.


రీనా, ఆమె భర్త, సోదరులు నా చావుకు కారణం. వారికి తగిన శిక్ష పడాలి. నా భార్య చాలా మంచిది. నా చావుకు, ఆమెకు ఎలాంటి సంబంధమూ లేద`ని రాసి సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం భార్య లేచి చూసి వెంటనే భర్తను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే విష్ణు చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పోస్ట్‌మార్టమ్ నిర్వహించి అతడి షర్టులో ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులకు అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Read more