నువ్వంటే నాకిష్టం.. నీ భార్యతో పాటు నేనూ మీ ఇంట్లోనే ఉంటా.. ప్రియుడికి ప్రియురాలి షాక్.. చివరకు..

ABN , First Publish Date - 2022-05-05T18:16:06+05:30 IST

అతను వివాహితుడు.. పిల్లలు కూడా ఉన్నారు.. అయినా వేరే యువతితో ప్రేమాయణం సాగించాడు..

నువ్వంటే నాకిష్టం.. నీ భార్యతో పాటు నేనూ మీ ఇంట్లోనే ఉంటా.. ప్రియుడికి ప్రియురాలి షాక్.. చివరకు..

అతను వివాహితుడు.. పిల్లలు కూడా ఉన్నారు.. అయినా వేరే యువతితో ప్రేమాయణం సాగించాడు.. భార్యను పట్టించుకోకుండా ఆమెతోనే తిరిగేవాడు.. అయితే కొద్ది రోజుల క్రితం నుంచి ప్రియురాలిని కూడా దూరం పెట్టాడు.. దీంతో ఆ ప్రియురాలి నేరుగా అతడి ఇంటికి వెళ్లిపోయింది.. నీ ఇంట్లోనే ఉంటానంటూ ప్రియుడికి షాకిచ్చింది.. దీంతో ఆగ్రహించిన ప్రియుడు ఆమెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు.. చివరకు పోలీసులకు దొరికిపోయాడు.


ఛత్తీస్‌గడ్‌లోని కొండగావ్ జిల్లా హీరాపూర్ గ్రామానికి చెందిన బోలోగౌడ్‌కు ఏడేళ్ల క్రితమే పెళ్లయింది. పిల్లలు కూడా ఉన్నారు. అయినా అతను వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కుటుంబాన్ని వదిలి ఆమెతోనే తిరిగేవాడు. కొన్ని రోజుల తర్వాత ఏమైందో ఏమో అతని ప్రవర్తనలో ఉన్నట్టుండి మార్పు వచ్చింది. ప్రియురాలిని దూరం పెట్టి కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించాడు. దీంతో ఆ ప్రియురాలు అసహనంతో ఊగిపోయింది. నేరుగా ప్రియుడి ఇంటికి వెళ్లి నిలదీసింది. 


నువ్వంటే నాకిష్టమని, నీ భార్యతో కలిసి నీ ఇంట్లోనే ఉంటానని ప్రియుడికి చెప్పింది. తనను కూడా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. బోలో గౌడ్ ఎంత నచ్చ చెప్పినా వినలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బోలోగౌడ్ చీరతో ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు క్రియేట్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలి ఫోన్ డేటాను పరిశీలించారు. చనిపోయే ముందు ఆ మహిళ ఎక్కువ సార్లు బోలోగౌడ్‌కు ఫోన్ చేసినట్టు తెలియడంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పోలీసుల ఎదుట బోలోగౌడ్ నిజం అంగీకరించాడు. 

Read more