ప్రియురాలి తల్లిపై గొడ్డలితో దాడి

ABN , First Publish Date - 2021-02-24T01:38:55+05:30 IST

జిల్లాలో దారుణం జరిగింది. తన ప్రియురాలితో పెళ్లికి అంగీకరించడం

ప్రియురాలి తల్లిపై గొడ్డలితో దాడి

జనగామ: జిల్లాలో దారుణం జరిగింది. తన ప్రియురాలితో పెళ్లికి అంగీకరించడం లేదని ప్రియురాలి తల్లిపై ఓ ప్రబుద్ధుడు దాడి చేశాడు. ఈ ఘటన లింగాల ఘనపురం మండలంలోని వనపర్తి మర్రి తండాలో జరిగింది. తమ పెళ్లికి ప్రియురాలి తల్లి నిరాకరిస్తుందనే కారణంతో ప్రియురాలి తల్లి ఆగమ్మపై నిందితుడు భూమయ్య గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆగమ్మ తీవ్రంగా గాయపడింది. ఆగమ్మ పరిస్థితి విషమం ఉంది. ఆగమ్మను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-02-24T01:38:55+05:30 IST