హైదరాబాద్‌లో బాలిక అమ్మకం..9 మంది అరెస్ట్

ABN , First Publish Date - 2022-01-25T01:48:25+05:30 IST

బాలికల దినోత్సవం రోజే దారుణ సంఘటన చోటు చేసుకుంది. బాలాపూర్‌లో బాలికను కుటుంబసభ్యులు అమ్మేశారు.14 ఏళ్ల అమ్మాయిని ..

హైదరాబాద్‌లో బాలిక అమ్మకం..9 మంది అరెస్ట్

హైదరాబాద్: బాలికల దినోత్సవం రోజే దారుణ సంఘటన చోటు చేసుకుంది. బాలాపూర్‌లో బాలికను కుటుంబసభ్యులు అమ్మేశారు.14 ఏళ్ల అమ్మాయిని అమ్మకానికి పెట్టారు. బాలికను ముంబైకి చెందిన ఓ వ్యక్తికి అమ్మేందుకు కుటుంబసభ్యుల యత్నించారు. బాలికను విక్రయించేందుకు రూ.5 లక్షలు డిమాండ్‌ చేశారు. రూ.3లక్షలు ఇచ్చి బాలికను తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సమాచారం అందడంతో రాచకొండ పోలీసులు బాలికను రక్షించారు. ముంబైకి చెందిన సయ్యద్‌ అల్తాఫ్‌తో పాటు మరో 8 మందిని అరెస్ట్‌ చేశారు. 

Updated Date - 2022-01-25T01:48:25+05:30 IST