స్కూల్‌లో అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేదని చితకబాదిన టీచర్.. ఆస్పత్రిలో ఆ విద్యార్థిని ఏ పరిస్థితిలో ఉందంటే..

ABN , First Publish Date - 2021-10-04T06:19:01+05:30 IST

ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్ సమీపంలోని ఒక గ్రామంలో ఎనిమిదో తరగతి చదివే ఒక విద్యార్థిని జిల్లా ఆస్పత్రిలో మృతి చెందింది. కుటుంబసభ్యుల ప్రకారం ఆ అమ్మాయి గత శుక్రవారం పాఠశాలకు వెళ్లింది

స్కూల్‌లో అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేదని చితకబాదిన టీచర్.. ఆస్పత్రిలో ఆ విద్యార్థిని ఏ పరిస్థితిలో ఉందంటే..

ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్ సమీపంలోని ఒక గ్రామంలో ఎనిమిదో తరగతి చదివే ఒక విద్యార్థిని జిల్లా ఆస్పత్రిలో మృతి చెందింది. కుటుంబసభ్యుల ప్రకారం ఆ అమ్మాయి గత శుక్రవారం పాఠశాలకు వెళ్లింది. ఆ రోజు స్కూల్‌లో అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్ప లేదని పెద్ద కర్రతో ఆ అమ్మాయిని మాస్టర్ చితకబాదాడు. 


తరువాతి రోజు అమె ఆరోగ్యం విషమించడంతో గ్రామంలో డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆ అమ్మాయి మ‌ృతి చెందింది. 14 ఏళ్ల తమ కూతురు అలా అర్థాతరంగా చనిపోవడంతో షాక్‌కు గురైన ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రిలో గొడవకు దిగారు. ఆ స్కూల్ టీచర్‌ను శిక్షించాలని డిమాండ్ చేశారు.


పోలీసు అధికారులు కల్పించుకొని ఆ స్కూల్ టీచర్‌పై చర్యలు తప్పకుండా తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కుటంబసభ్యులు శాంతించారు. అమ్మాయి శవాన్ని పోస్టుమార్టం కోసం పంపించి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-04T06:19:01+05:30 IST