నడిరోడ్డు మీద యువతిపై దారుణం.. కాపాడండి అని వేడుకున్నా కదలిరాని స్థానికులు..

ABN , First Publish Date - 2022-03-20T21:48:14+05:30 IST

`అన్నా.. చంపేస్తున్నాడు.. కాపాడండి`, `ఆంటీ రక్షించండి` అంటూ నడిరోడ్డు మీద ఆ యువతి చేసిన ఆర్తనాదాలు ఎవరికీ పట్టలేదు.

నడిరోడ్డు మీద యువతిపై దారుణం.. కాపాడండి అని వేడుకున్నా కదలిరాని స్థానికులు..

`అన్నా.. చంపేస్తున్నాడు.. కాపాడండి`, `ఆంటీ రక్షించండి` అంటూ నడిరోడ్డు మీద ఆ యువతి చేసిన ఆర్తనాదాలు ఎవరికీ పట్టలేదు. నడిరోడ్డు మీద ఓ యువతిపై దాడి జరుగుతుంటే అందరూ సినిమా చూసినట్టు చూశారు. తమ తమ సెల్‌ఫోన్లలో రికార్డు చేసుకునేందుకు పోటీ పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈ ఘటన జరిగింది. 


పరమ్‌దీప్ సింగ్ అనే యువకుడు బాధిత యువతితో కలిసి లక్నోలోని ఓ ప్రాంతంలో సహజీవనం చేస్తున్నాడు. మూడేళ్లుగా వీరిద్దరూ లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. శనివారం రాత్రి వీరి మధ్య మొబైల్ విషయంలో గొడవ మొదలైంది. దీంతో పరమ్‌దీప్ నడిరోడ్డుపై తన గాళ్‌ఫ్రెండ్‌ను చితకబాదాడు. జట్టు పట్టుకుని ఈడ్చుకుని వెళుతూ కొట్టాడు. ఆ సమయంలో బాధిత యువతి కేకలు పెట్టింది. `రక్షించండి` అని రోడ్డుపై ఉన్నవారిని అర్థించింది.


ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో స్థానిక పోలీసుల వరకు వెళ్లింది. వారు ఆ ప్రాంతానికి వెళ్లి నిందితుడిని, బాధితురాలిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. తన బాయ్‌ఫ్రెండ్ మీద చర్యలు తీసుకోవద్దని బాధితురాలు కోరింది. అయితే పోలీసులు మాత్రం పరమ్‌దీప్‌ను అదపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-03-20T21:48:14+05:30 IST