అనంతపురం : గుంతకల్లు పట్టణంలోని ఓ కాలనీలో కన్నకూతురిపై ఐదు నెలలుగా తండ్రి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. కడుపు నొప్పి అని బాలిక చెప్పడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఐదు నెలల గర్భిణీ అని వైద్యులు నిర్ధారించారు. అయితే రహస్యంగా ఆపరేషన్ చేయించేందుకు తల్లి యత్నించింది. పోలీసులకు వైద్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తండ్రిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.