రాత్రి పూట పోలీసులు వచ్చి అడిగిన ప్రశ్నకు నివ్వెరపోయిన ఆటో డ్రైవర్.. కంగారుగా వెళ్లి ఆటో సీటు వెనుక చూస్తే..

ABN , First Publish Date - 2021-12-10T22:31:52+05:30 IST

ఆమె తన బంధువుల పెళ్లి కోసం సూరత్ వెళ్లింది.. వివాహం పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి చేరుకునేందుకు

రాత్రి పూట పోలీసులు వచ్చి అడిగిన ప్రశ్నకు నివ్వెరపోయిన ఆటో డ్రైవర్.. కంగారుగా వెళ్లి ఆటో సీటు వెనుక చూస్తే..

ఆమె తన బంధువుల పెళ్లి కోసం సూరత్ వెళ్లింది.. వివాహం పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి చేరుకునేందుకు సూరత్ రైల్వే స్టేషన్‌కు ఆటోలో వెళ్లింది.. స్టేషన్‌ రాగానే ఆమె ఆటో నుంచి దిగిపోయింది.. కొద్దిసేపటి తర్వాత ఆమెకు తన బ్యాగ్ గుర్తుకొచ్చింది.. ఆటోలోనే బ్యాగ్ మర్చిపోయానని తెలిసి ఆమెకు గుండె ఆగినంత పనైంది.. ఎందుకంటే అందులో రూ.8 లక్షల విలువైన ఆభరణాలున్నాయి.. వెంటనే ఆమె పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది.. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ ఘటన జరిగింది. 


బరోడాకు చెందిన హేని పటేల్ అనే మహిళ తన బంధువుల వివాహం కోసం బుధవారం సూరత్‌ వెళ్లింది. వివాహం పూర్తయ్యాక గురువారం ఉదయం తిరిగి ఇంటికి బయల్దేరింది. తనతో పాటు తెచ్చుకున్న బ్యాగ్‌ను ఆటోలో వదిలేసి సూరత్ రైల్వే స్టేషన్‌లో దిగేసింది. బ్యాగ్‌ను ఆటోలో మర్చిపోయిన విషయం తెలుసుకుని ఆమె దిగ్భ్రాంతికి గురైంది. ఆ ఆటోలో రూ.8 లక్షల విలువైన నగలు ఉండడంతో ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్షణం కూడా ఆలస్యం చేయకుండా దర్యాఫ్తు ప్రారంభించారు. సూరత్ రైల్వే స్టేషన్‌లో అమర్చిన సీసీటీవీ కెమేరాలను పరిశీలించారు. 


సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆ మహిళ దిగిన ఆటో నెంబర్ తెలుసుకున్నారు. ఆ నెంబర్ ఆధారంగా ఆ ఆటో యజమాని ఎవరో తెలుసుకుని అతని ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి పోలీసులు వచ్చి బ్యాగ్ గురించి అడగడంతో ఆటో డ్రైవర్ ఆశ్చర్యపోయాడు. ఆ బ్యాగ్ గురించి తనకు తెలియదని చెప్పాడు. పోలీసులతో పాటు వెళ్లి ఆటో సీటు వెనుక చూస్తే బ్యాగ్ కనిపించింది. బ్యాగ్‌లో వస్తువులన్నీ ఉన్నాయి. ఆ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు హేనీ పటేల్‌కు అందించారు. 24 గంటల్లోనే తన కేసును పరిష్కరించినందుకు పోలీసులకు ఆమె ధన్యవాదాలు తెలిపింది.  



Updated Date - 2021-12-10T22:31:52+05:30 IST