చిన్నారికి పెద్ద కష్టం

ABN , First Publish Date - 2021-07-23T04:42:46+05:30 IST

ఆడుకుంటున్న చిన్నారికి దెబ్బ తగిలి ఒక కన్ను పోయింది.

చిన్నారికి పెద్ద కష్టం

కుక్కునూరు, జూలై 22 : ఆడుకుంటున్న చిన్నారికి దెబ్బ తగిలి ఒక కన్ను పోయింది. మరో కంటికి ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో పూర్తిగా అంధురాలయ్యే పరిస్థితి నెలకొంది. వైద్యం కోసం ఆర్థిక సాయమందించే దాతల కోసం బాలిక తల్లి ఎదురు చూస్తోంది, మండల పరిధిలోని మారపాక ఆదిలక్ష్మి, కుమారస్వామి దంపతుల కుమార్తె సారిక (12). ఇంట్లో ఆడుకుంటుండగా ఇనుపరాడ్డు కళ్లకు తగిలింది. దీంతో ఒక కన్ను పూర్తిగా కోల్పోగా మరో  కంటికి ఇన్ఫెక్షన్‌ సోకింది. వైద్యులు దాదాపు రూ.2లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. కుమారస్వామిని పాము కరవడంతో మృతి చెందాడు. ఒక పక్క భర్తను కోల్పోయి ఆధారం లేని ఆదిలక్ష్మి కూతురు కంటి చూపు కాపాడేం దుకు విలవిల్లాడుతోంది. ఆర్థిక సహాయం చేసి తమ పాప కంటి చూపును ఇవ్వాలని కోరుతుంది. ఫోన్‌ నెం.81066 76452 నెంబర్‌కు ఫోన్‌ పే, గూగుల్‌పే ద్వారా ఆర్థిక సహాయం అందించాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2021-07-23T04:42:46+05:30 IST