జాబ్ కోసమని ఇంటి నుంచి వెళ్లిన యువతి కిడ్నాప్.. 5 నెలల తర్వాత ఎలాంటి స్థితిలో కనిపించిందంటే..

ABN , First Publish Date - 2022-04-16T22:58:35+05:30 IST

ఆ యువతి ఉద్యోగం కోసం అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది.. ఆ తర్వాత ఆమె ఆచూకీ దొరకలేదు..

జాబ్ కోసమని ఇంటి నుంచి వెళ్లిన యువతి కిడ్నాప్.. 5 నెలల తర్వాత ఎలాంటి స్థితిలో కనిపించిందంటే..

ఆ యువతి ఉద్యోగం కోసం అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది.. ఆ తర్వాత ఆమె ఆచూకీ దొరకలేదు.. దీంతో ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. కొన్ని రోజుల అనంతరం తండ్రి మొబైల్ నెంబర్‌కు ఓ మెసేజ్ వచ్చింది.. తాను కిడ్నాప్‌నకు గురయ్యానని, వచ్చి కాపాడమని కూతురు మెసేజ్ పంపించింది.. పోలీసుల సహాయంతో సోదరుడు ఆమెను కాపాడాడు. 


పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లాలోని ఓ గ్రామంలో నివసిస్తున్న యువతి ఐదు నెలల క్రితం ఉద్యోగం కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ సమయంలో ఓ యువకుడు ఆమెను ప్రలోభ పెట్టి కిడ్నాప్ చేశాడు. దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె గురించి అన్వేషణ సాగించినా ఎలాంటి ఫలితమూ కనిపించలేదు. ఆ తర్వాత ఓ రోజు ఆ యువతి తన తండ్రి మొబైల్‌కి రెండు మెసేజ్‌లు పంపింది. 


`నాన్నా.. నన్ను యూపీలోని ఫతేపూర్ జిల్లాలో ఓ గదిలో బంధించారు. దయచేసి నన్ను త్వరగా విడిపించండి. ఈ నెంబర్‌కు కాల్ చేయవద్దు. మీరు ఫోన్ చేస్తే నన్ను చంపేస్తార`ని ఆమె మెసేజ్‌లో పేర్కొంది. ఆ మెసేజ్‌లను ఆ యువతి సోదరుడు పోలీసులకు చూపించాడు. దీంతో పంజాబ్ పోలీసులు ఫతేపూర్ పోలీసులకు సమాచారం అందించారు. టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు స్పాట్‌ను కనిపెట్టి యువతిని విడిపించారు. అప్పటికి ఆ యువతి మద్యం మత్తులో ఉంది. ఆమెను కిడ్నాప్ చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.  

Updated Date - 2022-04-16T22:58:35+05:30 IST