సెలవు రోజులలో మేనత్త ఇంటికి వచ్చిన బాలిక.. ఇంటి బయట షాపులో చాక్లెట్లు కొనేందుకు వెళ్లగా.. కారులో వచ్చిన ఇద్దరు యువకులు ఏంచేశారంటే..

ABN , First Publish Date - 2022-02-18T05:48:19+05:30 IST

సరదాగా మేనత్త ఇంటికి సెలవు రోజులలో వచ్చిన ఒక 16 ఏళ్ల బాలికను ఇంటి బయట నుంచి ఇద్దరు యువకులు కిడ్నాప్ చేశారు. ఆ తరువాత అడవిలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసి.. ఈ విషయం ఆమె ఎవ్వరికీ చెప్పకూడదని బాలికచేత ...

సెలవు రోజులలో మేనత్త ఇంటికి వచ్చిన బాలిక.. ఇంటి బయట షాపులో చాక్లెట్లు కొనేందుకు వెళ్లగా.. కారులో వచ్చిన ఇద్దరు యువకులు ఏంచేశారంటే..

సరదాగా మేనత్త ఇంటికి సెలవు రోజులలో వచ్చిన ఒక 16 ఏళ్ల బాలికను ఇంటి బయట నుంచి ఇద్దరు యువకులు కిడ్నాప్ చేశారు. ఆ తరువాత అడవిలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసి.. ఈ విషయం ఆమె ఎవ్వరికీ చెప్పకూడదని బాలికచేత విషం తాగించారు. అయినా పోలీసులు వారి ఆచూకీ తెలుసుకోగా.. ప్రధాన నిందితుడు పట్టుబడతాననే భయంతో ఎంత పని చేశాడంటే..


వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ది జిల్లాకు చెందిన సుకన్య(16, పేరు మార్చబడినది) రీవా జిల్లాలో తన మేనత్త ఇంటికి సరదాగా కొన్ని రోజులు గడుపుదామని వచ్చింది. అలా ఒకరోజు ఆమె ఇంటి నుంచి బయటకొచ్చి వీధిలోని ఒక కిరాణాషాపులో చాక్లె్ట్లు కొనడానికి వెళ్లింది. అదే సమయంలో ఒకకారులో పక్క ఊరి జమిందారు కుమారుడు తన ఇద్దరు స్నహితులతో కలిసి అక్కడికి వచ్చాడు. సుకన్య అందం చూసి ఆమెను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లాడు.


ఈ విషయం వీధిలో ఆడుకునే పిల్లలు సుకన్య కుటుంబ సభ్యలుకు తెలిపారు. దీంతో సుకన్య తండ్రి పోలీస్ స్టేషన్‌ వెళ్లి తన కూతురిని ఎవరో దుండుగులు కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు ఆ ఫిర్యాదుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు సుకన్యను కిడ్నాపర్లు అడవిలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. కానీ సుకన్య తనపై అత్యాచారం చేసిన వారిపై పోలీసులకు చెబుతానని కిడ్నాపర్లను బెదిరించింది. ఇది విన్న ఆ దుర్మార్గులు ఆమెకు విషం తాగించారు. సుకన్య చనిపోయిందేమోనని భావించి ఆమెను తీసుకెళ్లి ఇంటి ముందు పడేశారు. కానీ సుకన్య కొనఊపిరితో ఉంది.


సుకన్య ఆ స్థితిలో చూసిన ఆమె తండ్రి వెంటనే సుకన్యను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్క డ సుకన్య చనిపోతూ.. తనను కిడ్నాప్ చేసిన వ్యక్తి ఆ ఊరి జమిందారు కుమారుడు జీవేంద్ర సింగ్ అని చెప్పింది. జీవేంద్రతో పాటు అతని ఇద్దరు స్నేహితులు తనపై అత్యాచారం చేశారని కూడా చెప్పింది. ఈ విషయం సుకన్య తండ్రి పోలీసులకు చెప్పాడు. 


పోలీసులు వెంటనే జీవేంద్ర సింగ్ ఇంటికి వెళ్లగా.. అతను పోలీసులు తనను పట్టకుంటారనే భయంతో విషం తాగాడు. పోలీసులు అతడిని ఆస్పత్రికి చేర్చగా.. చికిత్స పొందుతూ మరణించాడు. జీవేంద్ర సింగ్‌కు కిడ్నాప్ వ్యవహారంలో సహాయం చేసిన అతని ఇద్దరు స్నేహితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు వారికోసం గాలిస్తున్నారు.



Updated Date - 2022-02-18T05:48:19+05:30 IST