Abn logo
Aug 3 2021 @ 23:26PM

బాలిక కిడ్నాప్‌ కలకలం?

అడవిలో గాలిస్తున్న పోలీసులు

 అచ్చంపేట ఆగస్టు 3 : బాలిక కిడ్నాప్‌ మన్ననూర్‌ గ్రామంలో కలకలం రేపుతోంది. మంగళవారం అచ్చంపేట మండలం మన్ననూర్‌ గ్రామంలోని అంబేడ్కర్‌ కాలనీ సమీపంలో ఓ ఆటోలో ఏడ్చుకుంటూ  వెళ్లిన ఓ బాలికను స్థానిక మహిళ గమనించి విషయాన్ని గ్రామస్థుల కు తెలిపింది. దాంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మం గళవారం రాత్రి అమ్రాబాద్‌ సీఐ బీసన్న ఆధ్వర్యంలో పోలీసులు, గ్రా మస్థులు ప్రతాపరుద్రుని కోట సమీపంలో అడవిని జల్లెడ పడుతున్నారు.  బాలికను ఎవరు కిడ్నాప్‌ చేశారు.. ఎందుకు చేశారు తెలియాల్సి ఉంది. అయితే ఈ ప్రాంతంలో సోమవారం డ్రోన్‌ కెమెరా తిరగడం, మంగళవారం ఓ బాలిక కిడ్నాప్‌ కావడం వెనుక పలు అ నుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుప్తనిధుల కోసమా లేక మరేమై నా కారణం ఉంటుందా అని పలువురు చర్చించుకుంటున్నారు.