Vijayawada: బాలిక kidnap కేసులో పురోగతి

ABN , First Publish Date - 2022-06-13T21:33:52+05:30 IST

నాలుగు రోజుల క్రితం విజయవాడ రైల్వేస్టేషన్‌ (Vijayawada Railway Station) లో కిడ్నాప్‌కు గురయిన బాలక కేసులో పోలీసులు పురోగతి సాధించారు.

Vijayawada: బాలిక kidnap కేసులో పురోగతి

విజయవాడ: నాలుగు రోజుల క్రితం విజయవాడ రైల్వేస్టేషన్‌ (Vijayawada Railway Station) లో కిడ్నాప్‌కు గురయిన బాలక కేసులో పోలీసులు పురోగతి సాధించారు. గుడివాడకు చెందిన మహిళలు బాలికను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలికను గుంటూరు (Guntur)లో పెంపకానికి ఇచ్చినట్టు నిర్థారించారు. బాలికను తీసుకెళ్లిన ఇద్దరు మహిళల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న చిన్నారిని ఇద్దరు మహిళలు కిడ్నాప్‌ చేశారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో పదో నంబర్‌ ప్లాట్‌ఫాంపై ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఆంజనేయులు విజయవాడకు చెందిన ముస్లిం మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి షఫీదా అనే పాప ఉన్నది. ఆంజనేయలు అక్కడే కూలి పని చేస్తుంటాడు. అతడి భార్య చెత్త కాగితాలు ఏరుతుంటుంది. ఇద్దరూ కలిసి రైల్వేస్టేషన్‌లో ఉంటున్నారు.


పదో నంబర్‌ ప్లాట్‌ఫాంపై రెండు రోజుల క్రితం సాయంత్రం ఆరు గంటల సమయంలో నిద్రపోతున్నారు. వారికి పక్కనే షఫీదా మేల్కొని ఉంది. ఇద్దరు మహిళలు అక్కడికి వచ్చి చాక్లెట్‌ ఇస్తామని పిలిచారు. వారి వద్దకు వెళ్లిన వెంటనే స్టేషన్‌ నుంచి బయటకు తీసుకొచ్చారు. నిద్ర నుంచి మేల్కొన్న తల్లిదండ్రులకు చిన్నారి కనిపించకపోవడంతో జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టేషన్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ఒక మహిళ చిన్నారిని తీసుకుని పదో నంబర్‌ ప్లాట్‌ఫాం మెట్లపై నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆ మహిళ వెనుక మరో మహిళ వెళ్లడం కనిపించింది. సీసీ దృశ్యాలు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసిన పోలీసులు... ఈ కేసులో పురోగతి సాధించారు.

Updated Date - 2022-06-13T21:33:52+05:30 IST