Viral Video: మెట్రో స్టేషన్ పైకి ఎక్కిన యువతి.. పోలీసులు చెబుతున్నా వినకుండా దూకేసింది.. కానీ..

ABN , First Publish Date - 2022-04-14T22:52:43+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలోని అక్షరధామ్ మెట్రో స్టేషన్‌లో ఓ యువతి చేసిన ఆత్మహత్యాయత్నం సంచలనంగా మారింది.

Viral Video: మెట్రో స్టేషన్ పైకి ఎక్కిన యువతి.. పోలీసులు చెబుతున్నా వినకుండా దూకేసింది.. కానీ..

దేశ రాజధాని ఢిల్లీలోని అక్షరధామ్ మెట్రో స్టేషన్‌లో ఓ యువతి చేసిన ఆత్మహత్యాయత్నం సంచలనంగా మారింది. మెట్రో స్టేషన్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ యువతి ప్రయత్నించింది. ఎవరి మాటలూ వినకుండా బిల్డింగ్ పై నుంచి దూకేసింది. అయితే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) సిబ్బంది అప్రమత్తమై ఆ యువతిని కాపాడారు. ఆ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 


ఈ ఘటన గురువారం ఉదయం 7.30 గంటల సమయంలో జరిగింది. అక్షరధామ్ మెట్రో స్టేషన్ గోడ ఎక్కుతున్న యువతిని చూసిన సీఐఎస్ఎఫ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. స్టేషన్‌ పైకి చేరుకుని ఆమెకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అక్కడ ఉన్న ప్రయాణికులు కూడా ఆమెకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. అయినా ఆ యువతి ఎవరి మాటా వినలేదు. బిల్డింగ్ పై నుంచి కిందకు దూకేసింది. అయితే అప్పటికే కింద పెద్ద వస్త్రం పట్టుకుని కొందరు సైనికులు నిల్చున్నారు. 


పై నుంచి పడిన యువతిని వస్త్రం సహాయంతో పట్టుకున్నారు. దీంతో ఆ యువతి సురక్షితంగా ఉంది. కాలికి చిన్న గాయం మాత్రమే అయింది. ఆ యువతిని వెంటనే లాల్ బహుదూర్ శాస్త్రి హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం సురక్షితంగానే ఉంది. 



Updated Date - 2022-04-14T22:52:43+05:30 IST