Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 29 Mar 2022 19:04:28 IST

ఇంకోసారి అతన్ని కలవొద్దంటూ కూతురికి సూచించిన తల్లి.. ఓ రోజు తల్లి పడుకుని ఉండగా.. ప్రియుడిని ఏకంగా ఇంటికే పిలిచి...

twitter-iconwatsapp-iconfb-icon
ఇంకోసారి అతన్ని కలవొద్దంటూ కూతురికి సూచించిన తల్లి.. ఓ రోజు తల్లి పడుకుని ఉండగా.. ప్రియుడిని ఏకంగా ఇంటికే పిలిచి...ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కూతుళ్లను ఎక్కడికి పంపాలన్నా.. తల్లిదండ్రులు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో చదువు కోసం బయటి ప్రాంతాలకు పంపిస్తూ ఉంటారు. అయితే అక్కడ వారు ఎలా ఉన్నారో అని.. రోజూ ఆలోచిస్తూ అదే ధ్యాసలో ఉంటారు. ఇంకొందరు తల్లిదండ్రులు.. కూతుళ్లను బయటికి పంపేటప్పుడు పదే పదే సలహాలు, సూచనలు ఇచ్చి మరీ పంపుతుంటారు. తమిళనాడులో ఓ తల్లి తన కూతురికి ఇలాగే సలహా ఇచ్చింది. ఇంకోసారి అతడితో పాటూ తిరగొద్దు అంటూ సూచించింది. అయినా కూతురు వినకపోవడంతో గట్టిగా మందలించింది. దీంతో ఓ రోజు  ఆ యువతి తన ప్రియుడిని ఏకంగా ఇంటికే పిలిచింది. అనంతరం వారు చేసిన పని.. స్థానికంగా సంచలనం కలిగించింది. అసలు ఏం జరిగిందంటే.. 

తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడికి చెందిన మునియలక్ష్మి అనే మహిళ నలుగురు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. మనస్పర్థల కారణంగా భర్తకు దూరంగా ఉంటూ.. పిల్లల పోషణార్థం.. స్థానికంగా ఉన్న ఓ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో తాత్కాలిక క్లీనర్​గా పని చేస్తోంది. ఈమె పెద్ద కూతురు పాలిటెక్నిక్ చదువుతూ మధ్యలోనే ఆపేసింది. ఈ క్రమంలో ఇంటి వద్ద ఉంటూ యువకులతో స్నేహం చేయడం మొదలెట్టింది. కొన్నాళ్లకు ఓ వ్యక్తి ఆమెకు బాగా దగ్గరయ్యాడు. తల్లికి తెలీకుండా అతడితో పాటూ తిరిగేది. ఆనోటా, ఈనోటా ఈ విషయం యువతి తల్లికి తెలిసింది. దీంతో ‘‘అతడితో కలిసి తిరగొద్దు’’.. అంటూ కూతురికి సూచించింది. అయినా కూతురి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఓ రోజు కూతురిని గట్టిగా మందలించింది. అప్పటి నుంచి ఆ యువతి తల్లిపై కోపం పెంచుకుంది.

భర్త మెసేజ్ చేయడంతో న్యూడ్ ఫొటోలు పంపిన భార్య.. కొన్నాళ్లకు అనుమానం వచ్చి ఆరాతీయగా..

తల్లి బతికుంటే తమ ప్రేమకు అడ్డొస్తుందని, ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. సోమవారం రాత్రి తల్లి నిద్రపోతుండగా.. ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. ఇద్దరూ కలిసి నిద్రపోతున్న మునియలక్ష్మిని దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వ్యభిచారం చేయమని ఒత్తిడి చేయడంతోనే తల్లిని హత్య చేశానని యువతి చెప్పింది. ఈ కారణంతోనే హత్య చేశారా? లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఎస్‌ఐ మరీ ఇంత శాడిస్టా.. ఉద్యోగం పేరుతో యువకుడిని 6నెలల పాటు ఒకే గదిలో ఉంచి మరీ..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

‘‘సమాజానికి భయపడకు.. మన ప్రేమ గురించి అందరికీ చెప్పు’’.. అంటూ వరుడి ముందే వధువుకు ధైర్యం చెప్పిన యువకుడు.. తర్వాత..videoViral Video: వివాహ వేదికపై ఈ వధువు వేసిన స్టెప్పులకు.. వరుడే సిగ్గుపడ్డాడు.. ఇంతకీ ఆమె ఎవరంటే..videoబరువు తగ్గాలనుకునేవారికి ఈ 6రకాల బియ్యం అద్భుతంతా పని చేస్తాయి... అవేంటో తెలుసుకుందామా..మేడమ్! ఆటోలో పెట్రోల్ అయిపోయింది.. పట్టుకొస్తానంటూ వెళ్లాడు.. తర్వాత స్నేహితుడితో కలిసి వచ్చి..అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్న తల్లీకొడుకును అడ్డుకున్న వ్యక్తులు.. అరిస్తే చంపేస్తామంటూ బెదిరించి.. చివరకు..అన్నాదమ్ములిద్దరికీ పెళ్లి ఫిక్స్.. పెళ్లి రోజు బంధువులతో సహా వధువుల ఇంటికి.. తీరా అక్కడ సీన్ చూసి..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.