ఇంట్లో ప్రేమకు అడ్డుచెప్పడంతో ప్రియుడితో కలిసి విషం తాగాలని నిర్ణయించిన యువతి.. ప్రియుడు విషం తాగిన వెంటనే ఊహించని మోసం!..

ABN , First Publish Date - 2022-04-05T08:56:14+05:30 IST

ప్రేమకోసం ఎన్నో జంటలు ఆత్మహత్యలు చేసుకోవడం వినే ఉంటాం. కానీ ఆత్మహత్య చేసుకోబోయి ప్రియుడికి ఓ యువతి మోసం చేసిన వింత ఘటన బీహార్‌లో జరిగింది....

ఇంట్లో ప్రేమకు అడ్డుచెప్పడంతో ప్రియుడితో కలిసి విషం తాగాలని నిర్ణయించిన యువతి.. ప్రియుడు విషం తాగిన వెంటనే ఊహించని మోసం!..

ప్రేమకోసం ఎన్నో జంటలు ఆత్మహత్యలు చేసుకోవడం వినే ఉంటాం. కానీ ఆత్మహత్య చేసుకోబోయి ప్రియుడికి ఓ యువతి మోసం చేసిన వింత ఘటన బీహార్‌లో జరిగింది. 


వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రంలోని ముంగేర్ జిల్లా రజవటి గ్రామంలో నివసించే హేమలత(పేరు మార్చబడినది) అనే యువతికి గత సంవత్సరం వివాహం జరిగింది. అయితే పెళ్లి తరువాత హేమలతకు సోను కుమార్ అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. కొంతకాలం తరువాత హేమలత ప్రేమ వ్యవహారం గురించి ఆమె భర్తకు తెలిసింది. దీంతో ఆమె ఇకపై తన ప్రియుడితోనే కలిసి ఉంటానని చెప్పింది. కానీ హేమలత భర్త ఆమెను చితకబాది ఇంట్లో నుంచి బయటికి వెళ్లనివ్వలేదు.


ఆ తరువాత ఒకరోజు హేమలతను చూసేందుకు ఆమె అమ్మమ్మ వచ్చింది. అప్పుడు హేమలత తన అమ్మమ్మ ఫోన్ తీసుకొని తన ప్రియుడు సోను కుమార్‌కు కాల్ చేసింది. వెంటనే తనను లేపుకుపోవాలని చెప్పింది. ఆమె చెప్పినట్లుగానే సోను కుమార్ చేశాడు. ఇద్దరూ కలిసి సోను కుమార్ గ్రామానికి పారిపోయారు. కానీ హేమలత భర్త వాళ్లని చంపడానికి వెతుకుతున్నాడని తెలయడంతో.. హేమలత ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. 


తన ప్రియుడితో కలిసి విషం తాగి చనిపోవాలని నిర్ణయించుకుంది. ఆమె కోసం సోను కుమార్ కూడా చావడానికి సిద్ధపడ్డాడు. అయితే ముందుగా విషం సోనుకుమార్ తాగాడు.. ఆ తరువాత సోను పరిస్థితి విషమించడం చూసి హేమలత భయపడిపోయింది. వెంటనే చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రియుడి అక్కడే వదిలేసి పారిపోయింది. కాసేపు తరువాత అక్కడ కొందరు గ్రామస్తులు వచ్చి సోను కుమార్ నోటి నుంచి నురుగు రావడం గమనించారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. 


ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోను కుమార్‌ని పోలీసులు ప్రశ్నించగా.. అతను జరిగిన విషయం చెప్పాడు. అయితే తాను హేమలతను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నానని.. ఆమెకోసం ఎన్నిసార్లైనా చావడానికి సిధ్దమని చెబుతున్నాడు.


Updated Date - 2022-04-05T08:56:14+05:30 IST