Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్.. వీడియో కాల్స్ లో చూసి నిజంగా అమ్మాయే అని నమ్మేశాడు.. పోలీసులు నిజాలు చెప్పేసరికి మైండ్ బ్లాక్

ఇంటర్నెట్ డెస్క్: అతనో చిన్న వ్యాపారవేత్త. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. అలాంటి వ్యక్తికి ఫేస్‌బుక్‌లో ఒక అందమైన అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దాన్ని అంగీకరించిన ఆయన.. కొన్ని రోజులు ఆమెతో చాట్ చేశాడు. ఆ తర్వాత రెండ్రోజులకే సదరు యువతి అతనికి వీడియో కాల్ చేసింది. ఆ వీడియో కాల్‌లో మత్తెక్కించే మాటలు మాట్లాడుతూ, వెర్రెత్తించే సైగలు చేసింది. అంతే, ఆ తర్వాత సదరు వ్యాపార వేత్తకు ఫోన్ వచ్చింది. తమకు రూ.2లక్షలు ఇవ్వకపోతే అతను ఆ అమ్మాయితో మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిందీ ఘటన.


‘‘అది కేవలం 15 సెకన్ల వీడియో కాల్. ఆ కాల్ కట్ అయిన 15 నిమిషాల్లోనే నాకు ఫోన్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టారు. నేను అసభ్యంగా ప్రవర్తించలేదు. కానీ, ఆ కాల్ చేసిన వ్యక్తి నాతో బేరాలాడుతూ చివరకు రూ.50వేలకు దిగొచ్చాడు’’ అని ఆ వ్యాపారవేత్త సైబర్ సెల్ పోలీసులకు వివరించాడు. ఈ విషయం తెలిసి దర్యాప్తు చేసిన పోలీసులకు ఆశ్చర్యకర విషయం తెలిసింది. సదరు కాల్‌లో మాట్లాడిన యువతి అసలు నిజమైన యువతే కాదని తేలింది. డీప్‌ఫేక్ సాంకేతికతతో ఆ అమ్మాయి రూపాన్ని తయారుచేశారని, స్వరం కూడా టెక్నాలజీతో చేసిన నకిలీ అని తెలిసింది.


ప్రస్తుతం ఇలా వచ్చే మోసపూరిత కాల్స్‌లో 60శాతం వాటిలో ఇలాంటి నకిలీ యువతులే ఉంటున్నారని సైబర్ సెల్ పోలీసులు చెప్తున్నారు. ఇంతకు ముందు ఇలాంటి మోసాలు చేయాలంటే మహిళల అవసరం ఉండేదని, కానీ ప్రస్తుతం సాంకేతికతను ఉపయోగించి ఆ అడ్డంకిని కూడా సైబర్ నేరగాళ్లు దాటేస్తున్నారని తెలిపారు. ఈ కేటుగాళ్లు ఈ నకిలీ అమ్మాయిలను సృష్టించడం కోసం పోర్న్ వెబ్‌సైట్లలో వీడియోలను ఆధారం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇలాంటి మోసగాళ్ల చేతికి చిక్కకూడదంటే తెలియని వారి నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అంగీకరించకపోవడమే ఉత్తమమని పోలీసులు సూచిస్తున్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement