నెల క్రితం నిశ్చితార్థం.. నాకు అతను నచ్చలేదు.. ఈ పెళ్లి చేసుకోలేను.. అంటూ ఆ 19 ఏళ్ల యువతి నిర్ణయమిదీ..!

ABN , First Publish Date - 2022-01-01T17:42:15+05:30 IST

ఆ యువతికి నెల రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది.. ఈ నెల 23న పెళ్లి జరగాల్సి ఉంది..

నెల క్రితం నిశ్చితార్థం..  నాకు అతను నచ్చలేదు.. ఈ పెళ్లి చేసుకోలేను.. అంటూ ఆ 19 ఏళ్ల యువతి నిర్ణయమిదీ..!

ఆ యువతికి నెల రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది.. ఈ నెల 23న పెళ్లి జరగాల్సి ఉంది.. నిశ్చితార్థం తర్వాత ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఆ యువతి దిగాలు పడిపోయింది.. పెళ్లి కొడుకు నచ్చకపోవడమే ఆ యువతి దిగులుకు కారణం.. తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని తల్లిదండ్రులకు ఎన్నోసార్లు చెప్పి చూసింది.. అయినా ఫలితం దక్కలేదు.. మరోరవైపు పెళ్లి ముహూర్తం దగ్గరపడుతోంది.. ఇక, పెళ్లి తప్పదనే భయం పట్టుకుంది.. దీంతో ఆ యువతి దారుణ నిర్ణయం తీసుకుంది.. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


రాయ్‌పూర్‌లో నివసిస్తున్న ప్రేమ కుమారి (19) అనే యువతికి అదే ఊరికి చెందిన 26 ఏళ్ల యువకుడితో నెల రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 23న పెళ్లి ముహూర్తం పెట్టారు. అయితే ఆ యువకుడు ప్రేమకు నచ్చలేదు. దీంతో ఆ పెళ్లి వద్దని ప్రేమ తల్లిదండ్రులకు చెప్పింది. అయితే వారు పెళ్లిని ఆపేందుకు ఇష్టపడలేదు. తల్లిదండ్రులకు నచ్చ చెప్పేందుకు ప్రేమ ఎంతగానో ప్రయత్నించింది. అయినా వారు ప్రేమ మాటలను పట్టించుకోలేదు. దీంతో ఆమె దారుణ నిర్ణయం తీసుకుంది. 


గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బయటి నుంచి తిరిగి వచ్చిన తండ్రి.. ప్రేమ ఉరి వేసుకోవడాన్ని చూసి షాకయ్యాడు. వెంటనే హాస్పిటల్‌కు తరలించాడు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు సాగిస్తున్నారు. 

Updated Date - 2022-01-01T17:42:15+05:30 IST