స్కూల్ కెళ్లిన బాలికపై అత్యాచారం.. నిందితుడెవరో తెలిసి అంతా షాక్!

ABN , First Publish Date - 2022-05-27T09:15:39+05:30 IST

ఒక తొమ్మిదవ తరగతి చదివే బాలిక(15) పరీక్ష రాసేందుకు స్కూల్‌కు వెళ్లింది. అక్కడ ఆమెపై ప్రిన్సిపాల్ కొడుకు అత్యాచారం చేశాడు. ఈ విషయం ఆ బాలిక ఎవరికీ చెప్పకూడదనీ అతను బెదిరించాడు. కానీ ఇంటికి వచ్చిన బాలిక పరిస్థితి చూసి ఆమె తల్లికి అనుమానం వచ్చింది. దీంతో ఆ బాలిక ఏడుస్తూ తన తల్లికి జరిగిన విషయం...

స్కూల్ కెళ్లిన బాలికపై అత్యాచారం.. నిందితుడెవరో తెలిసి అంతా షాక్!

ఒక తొమ్మిదవ తరగతి చదివే బాలిక(15) పరీక్ష రాసేందుకు స్కూల్‌కు వెళ్లింది. అక్కడ ఆమెపై ప్రిన్సిపాల్ కొడుకు అత్యాచారం చేశాడు. ఈ విషయం ఆ బాలిక ఎవరికీ చెప్పకూడదనీ అతను బెదిరించాడు. కానీ ఇంటికి వచ్చిన బాలిక పరిస్థితి చూసి ఆమె తల్లికి అనుమానం వచ్చింది. దీంతో ఆ బాలిక ఏడుస్తూ తన తల్లికి జరిగిన విషయం చెప్పింది. ఆ బాలిక తల్లి పోలీసులను తీసుకొని ఆ స్కూలుకు రావడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన అత్యాచారాలు ఎక్కువగా జరిగే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే ఉత్తర్ ప్రదేశ్‌లోని ఈటా ప్రాంతానికి చెందిన దిశ(15, పేరు మార్చబడినది) అనే బాలిక తొమ్మిదవ తరగతి చదువుకుంటోంది. ఆమె గత వారం పరీక్ష రాసేందుకు స్కూలుకు వెళ్లింది. పరీక్ష అయిపోగానే అందరూ ఇంటికి వెళుతుండగా.. ఆ స్కూలులో పనిచేసే ఒక ఉపాధ్యాయుడు దిశను ఆపి తరగతి గదిలో ఉన్న కుర్చీని పక్క గదిలోకి తీసుకురమ్మన్నాడు. 


ఉపాధ్యాయుడు చెప్పినట్లుగానే దిశ ఒక కుర్చీని పక్క గదిలోకి తీసుకెళ్లింది. ఆ గదిలోకి వెళ్లగానే దిశ వెనుక నుంచి ఆ ఉపాధ్యాయుడు కూడా వెంటనే వచ్చి గదికి లోపలి నుంచి లాక్ చేశాడు. అది చూసి దిశ ఒక్కసారిగా భయపడి పోయింది. ఆ తరువాత ఆమె గట్టిగా అరుస్తూ ఉండడంతో అతను దిశ నోరు మూసి చంపేస్తానని బెదిరించి.. ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బయట ఎవరికీ చెప్ప కూడదని లేకపోతే మళ్లీ అదే జరుగుతుందని భయపెట్టాడు.


ఆ ఉపాధ్యాయుడు ఆ స్కూలు ప్రిన్సిపాల్ కుమారుడు కూడా. దీంతో దిశ ఆ ఘటన గురించి బయట ఎవరికీ చెప్పకుండా ఇంటికి వెళ్లిపోయింది. ఇంటికి వణుకుతూ వచ్చిన దిశను చూసి ఆమె తల్లి ఏం జరిగిందని ఆరా తీసింది. మొదటి చెప్పడానికి భయపడిన దిశ.. తల్లితో తన బాధ చెప్పుకుంది. దిశ చెప్పిన మాటలు విని షాకైన ఆమె తల్లి వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది.


పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కోసం స్కూలుకు వెళ్లారు. అక్కడ ఆ ఉపాధ్యాయుడు లేకపోవడంతో పోలీసులు అతడిని అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.


Updated Date - 2022-05-27T09:15:39+05:30 IST