బాలికా చట్టాలపై అవగాహన పెరగాలి

ABN , First Publish Date - 2022-01-25T05:53:43+05:30 IST

బాలికా సంరక్షణపై ప్రత్యేక చట్టాలు ఉన్నా యని వాటిపై బాలికల్లో అవగాహన పెరగాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యా లయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు. జాతీయ బాలికా దినో త్సవం జిల్లాలో పలుచోట్ల సోమవారం జరిగింది.

బాలికా చట్టాలపై అవగాహన పెరగాలి
రాజమహేంద్రవరం సదస్సులో మాట్లాడుతున్న ప్రత్యూష్‌కుమారి

  • నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి జగన్నాథరావు
  • పలుచోట్ల జాతీయ బాలికా దినోత్సవం 

 దివాన్‌చెరువు, జనవరి 24: బాలికా సంరక్షణపై ప్రత్యేక చట్టాలు ఉన్నా యని వాటిపై బాలికల్లో అవగాహన పెరగాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యా లయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు. జాతీయ బాలికా దినో త్సవం జిల్లాలో పలుచోట్ల సోమవారం జరిగింది. నన్నయ వర్శిటీలో మహిళా సాధికారికత, అభివృద్ధి, గ్రీవెన్‌సెల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్‌ సదస్సుకు వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ బాలికల విద్య, ఆరోగ్య, రక్షణకు సంబంధించి ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లలను బరువుగా భావించి బాల్యవివాహాలు చేస్తున్నారని, ఇది చట్టరీత్యా నేరమని చెప్పారు. బాలికలు సమాజంలోని ఉన్నత స్థానాలకు ఎదగాలని వీసీ అన్నారు. మహిళా కమిషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ ఆర్‌.సూయజ్‌, బేటీ బచావో-బేటీ పడావో రాష్ట్ర కోకన్వీనర్‌, ప్రముఖ న్యాయవాది రహీమున్నీసాబేగం బాలిక సంర క్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నన్నయ వర్శిటీ మహిళా సాధికారికత, అభివృద్ధి, గ్రీవెన్స్‌సెల్‌ కోఆర్డినేటర్‌ కె.నూకరత్నం, అధ్యాపకులు  ఎం.కమలకుమారి, పి.ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T05:53:43+05:30 IST