23రోజులైనా లభించని బాలిక ఆచూకీ

ABN , First Publish Date - 2021-01-12T05:03:08+05:30 IST

ఓ ఇంట్లో క్షుద్రపూజలు జరిగిన నేపథ్యంలో గతనెల 17వతేదీన ఖమ్మంజిల్లా ఎర్రు పాలెం మండలం రేమిడిచర్ల గ్రామానికి చెందిన పదహా రేళ్ల ఓ బాలిక అదృశ్యమైన విషయం తెలిసిందే.

23రోజులైనా లభించని బాలిక ఆచూకీ

 కేసు ఛేదనలో జాప్యంపై గ్రామస్థుల ఆగ్రహం

 పూజారి పలుకుబడితోనే కేసు నీరుగారుస్తున్నారని ఆరోపణ

ఎర్రుపాలెం, జనవరి 11: ఓ ఇంట్లో క్షుద్రపూజలు జరిగిన నేపథ్యంలో గతనెల 17వతేదీన ఖమ్మంజిల్లా ఎర్రు పాలెం మండలం రేమిడిచర్ల గ్రామానికి చెందిన పదహా రేళ్ల ఓ బాలిక అదృశ్యమైన విషయం తెలిసిందే. ఇది జరిగి నెల కావొస్తున్నా నేటికీ బాలిక ఆచూకీ కనుక్కోవ డంలో పోలీస్‌ యంత్రాంగం విఫలమైందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలిక ఆచూకీ విషయమై ఆమె తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా.. ఈ కేసు విచారణలో పోలీస్‌ యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోం దన్న ఆరోపణలు విన్పిస్తున్నా యి. ప్రస్తుతం పోలీసు శాఖ వద్ద సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా సదరు బాలిక ఆచూకీ కనుగొనటంలో అంతగా శ్రద్ధ చూపటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఎర్రుపాలేనికి చెందిన పూజారి శివయ్య రాష్ట్రస్థాయిలో పెద్దలతో మాట్లా డి ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామ స్థులు ఆరోపిస్తున్నారు. బాలిక అదృశ్యంపై ఫిర్యాదు ఇచ్చిన వారంరోజుల అనంతరం బాలిక తల్లి, బంధువులు, గ్రామస్థులతో కలిసి తమ కుమార్తె ఆచూకీ కనిపెట్టడం లేదంటూ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మధిర సీఐ మురళీ బాలిక ఆచూకీని త్వరలో నే కనుగొని అప్పగిస్తామని హామీ ఇచ్చి ఆందోళన విర మించారు. కానీ నేటివరకు బాలిక ఆచూకీ కనుగొనలేకపో వడంతో బాలిక తల్లి, బంధువులు, గ్రామస్థులు అఖిలప క్షం ఆధ్వర్యంలో విలేకరుల ముందు వాపోయారు.


ఎస్‌ఐ ఏమంటున్నారంటే..


బాలిక అదృశ్యంపై ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా పలు కోణాల్లో విచారణ జరుపుతున్నా మని త్వరలోనే బాలిక ఆచూకీ కనుగొంటామన్నారు. అలాగే సీఐ మురళీని వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.


Updated Date - 2021-01-12T05:03:08+05:30 IST