Abn logo
Feb 22 2020 @ 03:02AM

ముస్లింలను పాక్‌కు పంపనందుకు భారీ మూల్యం

  • నిర్వాసిత ముస్లింయేతరుల కోసమే ఎన్నార్సీ: గిరిరాజ్‌ సింగ్‌ 

పట్నా/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సంలచలన వాఖ్యలు చేశారు. దేశ విభజన సమయంలో ముస్లింలను పాకిస్థాన్‌కు పంపించనందుకు, హిందువులను భారత్‌కు రప్పించేందుకు భారత్‌ భారీ మూల్యం చెల్లిస్తోందని అన్నారు. గురువారం రాత్రి పట్నాలో మీడియాతో ఆయన మాట్లాడారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌ నుంచి నిర్వాసితులైన ముస్లింయేతర శరణార్థులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకే సీఏఏని తీసుకొచ్చామన్నారు. కాగా, గిరిరాజ్‌ సింగ్‌ వ్యాఖ్యలను బీజేపీ మిత్రపక్షం ఎల్‌జేపీ తీవ్రంగా ఖండించింది. 

Advertisement
Advertisement
Advertisement