గిరిజనులకు ఇళ్లేవి..?

ABN , First Publish Date - 2021-10-28T03:35:30+05:30 IST

మండలంలోని ముదివర్తిపాళెంలో చల్లా యానాదులు, గిరిజనుల కుటుంబాలకు సంబంధించి అధికారులు ఇళ్లు కేటాయించడం లేదని బీజేపీ జిల్లా గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు పోట్లూరి శ్రీనివాసులు అన్నారు.

గిరిజనులకు ఇళ్లేవి..?
గిరిజనులతో బీజేపీ జిల్లా గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు

 ఇందుకూరుపేట, అక్టోబరు 27 : మండలంలోని ముదివర్తిపాళెంలో చల్లా యానాదులు, గిరిజనుల కుటుంబాలకు సంబంధించి అధికారులు ఇళ్లు కేటాయించడం లేదని బీజేపీ జిల్లా గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు పోట్లూరి శ్రీనివాసులు అన్నారు. బుధవారం గ్రామంలో పర్యటించి 20 కుటుంబాలు రైతుల పొలంలో, ఆక్వా కయ్యల మీద వారి దయాదాక్షిణ్యాలతో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారన్నారు. ఈ క్రమంలో గిరిజనులతో ఆయన సమస్యలపై మాట్లాడారు. వీటిపై మండల అధికారులు స్పందించకపోతే, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతామని పేర్కొన్నారు. వందల, వేల ఇళ్లు మంజూరు చేశామని చెబుతున్న అధికారులకు మండలంలో గిరిజనులు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. ఈ విషయమై గిరిజనులతో మాట్లాడిన అనంతరం ఎస్టీ సంఘానికి  ఫిర్యాదు చేస్తామని తెలిపారు.  

Updated Date - 2021-10-28T03:35:30+05:30 IST