ఉమ్మడి జిల్లా రిజిస్ర్టేషన్‌ డీఐజీగా గిరిబాబు

ABN , First Publish Date - 2022-07-02T06:17:51+05:30 IST

ఉమ్మడి జిల్లా స్టాంపులు, రిజిస్ర్టేషన్‌శాఖ డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌గా పి. గిరిబాబు శుక్రవారం చిత్తూరులో బాధ్యతలు స్వీకరించారు.

ఉమ్మడి జిల్లా రిజిస్ర్టేషన్‌ డీఐజీగా గిరిబాబు
నూతన డీఐజీ గిరిబాబుకు పుష్పగుచ్చం అందిస్తున్న సబ్‌ రిజిస్ర్టార్‌ రహంతుల్లా

చిత్తూరు కలెక్టరేట్‌, జూలై 1: ఉమ్మడి జిల్లా స్టాంపులు, రిజిస్ర్టేషన్‌శాఖ డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌గా పి. గిరిబాబు శుక్రవారం చిత్తూరులో బాధ్యతలు స్వీకరించారు.  ఇక్కడ డీఐజీగా పనిచేస్తున్న పుష్పలతను ప్రభుత్వం ఈ నెల 19న ఒంగోలుకు బదిలీ చేస్తూ ఆమె స్తానంలో అనంతపురం జిల్లా డీఐజీ ఎన్‌. మాధవిని నియమించింది. మాధవి ఈనెఎల 20న చిత్తూరుకు చేరుకుని బాధ్యతలు తీసుకుని మరుసటి రోజు నుంచి అనారోగ్యం కారణంగా సెలవుల్లో వెళ్లారు. దాంతో ప్రభుత్వం మాధవి స్థానంలో కడప జిల్లా డీఐజీ గిరిబాబును చిత్తూరు జిల్లాకు నియమిస్తూ ప్రభుత్వం  గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.



Updated Date - 2022-07-02T06:17:51+05:30 IST