Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

అల్లం సూప్‌

అల్లం సూప్‌

కావలసినవి: తియ్యటి గుమ్మడికాయ - ఒకటి, అల్లం - 50 గ్రాములు, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - రెండు, వెజిటబుల్‌ స్టాక్‌ - నాలుగు కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - అర టీస్పూన్‌, ఆలివ్‌ ఆయిల్‌ - ఒక టేబుల్‌స్పూన్‌. 


తయారీ : అల్లం, వెల్లుల్లి రెబ్బలను దంచుకోవాలి. ఉల్లిపాయలు కట్‌ చేసి పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి ఆలివ్‌ ఆయిల్‌ వేయాలి. నూనె వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి. తరువాత అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి మరికాసేపు వేగించాలి. ఇప్పుడు తియ్యటి గుమ్మడి కాయ ముక్కలు, వెజిటబుల్‌ స్టాక్‌ వేసి కలపాలి. అరగంటపాటు ఉడికించాలి. గుమ్మడికాయ ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత స్టవ్‌పై నుంచి దింపాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి బ్లెండ్‌ చేస్తే అల్లం సూప్‌ రెడీ. వేడిగా వేడిగా సర్వ్‌ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రిజ్‌లో పెట్టుకుని తరువాత క్విక్‌ మీల్‌గా సర్వ్‌ చేయవచ్చు.

మామిడికాయ రసంమామిడికాయ రసంపెసరపప్పు రసం పెసరపప్పు రసం బ్రొకోలీ సూప్‌బ్రొకోలీ సూప్‌చిక్కుడుకాయ రసంచిక్కుడుకాయ రసంనూడుల్స్‌ సూప్‌ నూడుల్స్‌ సూప్‌ ఉల్లిపాయ సూప్ఉల్లిపాయ సూప్బెండకాయ సూప్‌బెండకాయ సూప్‌గుమ్మడికాయ సూప్గుమ్మడికాయ సూప్బీరకాయ సూప్‌బీరకాయ సూప్‌సొరకాయ సూప్‌సొరకాయ సూప్‌
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.