కావలసినవి: బోన్‌లెస్ చికెన్ - అరకేజీ, అల్లం పేస్టు - రెండు టేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి పేస్టు - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, కోడిగుడ్డు - ఒకటి, కార్న్‌ఫ్లోర్ - మూడు టేబుల్‌స్పూన్లు, నూనె - సరిపడా, ఎండుమిర్చి - మూడు, చికెన్ మసాల - రెండు టేబుల్‌స్పూన్లు, చికెన్ స్టాక్ - అరకప్పు, ఉల్లిపాయలు - రెండు.
తయారీ విధానం: చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి అల్లం పేస్టు, కొద్దిగా ఎండుమిర్చి పేస్టు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మారినేట్ చేసుకోవాలి. ఒక బౌల్లో కోడిగుడ్డు పగలకొట్టి వేయాలి. అందులో కార్న్‌ఫ్లోర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై కడాయి పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక చికెన్ ముక్కలు వేసి వేగించాలి. చికెన్ ముక్కలు బాగా వేగిన తరువాత తీసి బౌల్లోకి మార్చుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఎండుమిర్చి వేసి వేగించాలి. తరువాత దంచిన అల్లం వేయాలి. మిగిలిన ఎండుమిర్చి పేస్టు, చికెన్‌మసాల, చికెన్ స్టాక్, కార్న్‌ఫ్లోర్ మిశ్రమం వేసి కలుపుకోవాలి. చివరగా వేగించిన చికెన్ ముక్కలు వేసి కలియబెట్టుకోవాలి. కాసేపు వేగించుకున్న తరువాత దింపుకొని సర్వ్ చేసుకోవాలి.