Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆస్తమాకు అల్లంతో చెక్!

ఆంధ్రజ్యోతి(16-03-2020)

అల్లం వంటలకు రుచిని తెచ్చిపెట్టడమే కాదు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. ఆ రుచిని తగ్గించటం దగ్గర్నుంచి జీర్ణక్రియ పుంజుకునేలా చేయటం వరకు రకరకాలుగా ఉపయోగపడుతుంది. దీని జౌషధ గుణాల్లో కొత్తగా మరోటి వచ్చి చేరింది. అల్లంలోని రసాయనాలు ఆస్తమా లక్షణాలు తగ్గటానికీ తోడ్పడగలవని తేలింది. ఆస్తమా బాధితుల్లో ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాలు సన్నబడి శ్వాస తీసుకోవటం కష్టమవుతుంది. సాధారణంగా వీరికి గాలి గొట్టాల్లోని మృదుకండర (ఎఎస్‌ఎం) కణజాలాన్ని వదులు చేసే మందులు ఇస్తుంటారు. దీంతో శ్వాస తీసుకోవటం తేలికవుతుంది. అల్లంలోని జింజెరాల్, షాగావోల్ అనే రసాయనాలను శుద్ధిచేసి వాడితే.. ఆస్తమా మందుల మాదిరిగానే పనిచేస్తుందని కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. ఊపిరితిత్తుల్లో ఉండే 'పీడీఈ4డీ' అనే ఎంజైమ్ గాలిగొట్టాలు వదులయ్యే ప్రక్రియను అడ్డుకుంటుంది. అల్లంలోని రసాయనాలు ఈ ఎంజైమ్‌ను నిరోధిస్తున్నట్టు కనుగొన్నారు.

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...