గిండిలో హెచ్‌ఈసీఎస్ కార్పొరేట్‌ కార్యాలయం

ABN , First Publish Date - 2022-05-27T14:11:00+05:30 IST

మురుగునీటి శుద్ధీకరణ తదితర పర్యావరణ సంబంధింత సమస్యల పరిష్కార సంస్థ హెచ్‌ఈసీఎస్ స్థానిక గిండి పారిశ్రామిక వాడలో కార్పొరేట్‌ కార్యాలయాన్ని నిర్మించింది. గురువారం

గిండిలో హెచ్‌ఈసీఎస్ కార్పొరేట్‌ కార్యాలయం

చెన్నై: మురుగునీటి శుద్ధీకరణ తదితర పర్యావరణ సంబంధింత సమస్యల పరిష్కార సంస్థ హెచ్‌ఈసీఎస్ స్థానిక గిండి పారిశ్రామిక వాడలో కార్పొరేట్‌ కార్యాలయాన్ని నిర్మించింది. గురువారం ఉదయం ఈ కొత్త కార్యాలయాన్ని  రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి మెయ్యనాధన్‌ ప్రారంభించారు. అదే సమయంలో వల్లమ్‌ వడగల్‌ సిప్కాట్‌ ప్రాంతంలో ఆ సంస్థ కొత్త కర్మాగారానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మెయ్యనాధన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో నీటి, వాయు కాలుష్య నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపడుతోందని తెలిపారు. హెచ్‌ఈసీఎ్‌స వంటి సంస్థలు పారిశ్రామికవాడలలో, కర్మాగారాల్లో మురుగునీటి శుద్ధీకరణ ప్రాజెక్టులను చేపడుతుండటం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీఈఓ డాక్టర్‌ జేఆర్‌ మోసెస్‌, చెన్నైలోని యూఎస్‌ కాన్సులేట్‌ ఆర్థిక విభాగం అధికారి డస్టిన్‌ బికేల్‌, క్రైస్తవ మతాధిపతి వి. దేవసహాయం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T14:11:00+05:30 IST