Abn logo
Oct 2 2020 @ 03:35AM

విద్యార్థులకు బహుమతులు

ఆలమూరు, అక్టోబరు 1: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంపకం కీలకమని వీటిని పరిరక్షించే విద్యార్థులకు ప్రతీ ఏడాది బహుమతులు అందించనున్నట్లు పశ్చిమగోదావరి జిల్లా తణుకు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ సంపత్‌కుమార్‌ తెలిపారు. ఆలమూరు మండలం చెముడులంక జెడ్పీ హైస్కూల్‌ ఆవరణలో మొక్కలు పెంపకానికి ఆయన రూ.40వేల విలువగల మొక్కలను అందించారు. వీటిని నాటే కార్యక్రమం గురువారం ప్రారంభించారు. మొక్కలను క్రమతప్పకుండా పోషించే విద్యార్దులకు ప్రతీ ఏడాది డిసెంబరులో బహుమతులు అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈకార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్‌ తమ్మన శ్రీనివాస్‌, తమ్మన గోపాలకృష్ణ, పాఠశాల హెచ్‌ఎం టి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement