Abn logo
Oct 18 2020 @ 17:08PM

సహాయక చర్యలను ముమ్మరం చేసిన జీహెచ్ఎంసి

Kaakateeya

హైదరాబాద్: వరదప్రాంతాల్లో సాధారణ స్థితులు తెచ్చెoదుకు జి హెచ్ ఎం సి యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. భారీ వర్షాలు గురించి యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, ప్రజలకు ఎప్పటి కప్పుడు తగు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. ముందు జాగ్రత్తగా  లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేసి ఖాళీ చేయిస్తున్నట్లు తెలిపారు.  ఈ నెల 13 న కురిసిన భారీ వర్షంతో పలు కాలనీలలోని  35 వేల 309 కుటుంబాలు ముంపుకు గురైనారు. మొత్తం 37,409 కుటుంబాలు వరద ముంపుకు గురైనట్లు కమిషనర్ వివరించారు. 


బాధిత కుటుంబాలకు రూ 2800/-విలువైన ముఖ్యమంత్రి రేషన్ కిట్,మూడు బ్లాంకెట్లు ఇస్తున్నట్లు చెపారు. భాదితకుటుంబాల ఇండ్ల వద్దకే వెళ్లి, అందజేస్తున్నామనారు. ఇప్పటివరకు 20 వేల రేషన్ కిట్స్, బ్లాంకెట్లు పంపిణీ చశామనారు. మిగిలిన రేషన్ కిట్స్, బ్లాంకెట్లను 19 సాయంత్రం వరకు పంపిణి చేయనున్నారు. అదే విధంగా వరద ప్రాంతాల్లోని కుటుంబాలకు పాలు, బ్రెడ్, బిస్కట్లను అందజేస్తున్నట్లు తెలిపారు.


మధ్యాహ్నం 90 వేలు, సాయంత్రం 60 వేల బోజనాలను రెగ్యులర్ అన్నపూర్ణ కేంద్రాలతో పాటు వరద ప్రాంతాలతో ప్యాకింగ్ చేసి ఉచితంగా అందజేస్తున్నట్లు కమిషనర్ లోకేశ్ కుమార్ వివరించారు.వరద సహాయక చర్యల విషయంలో సహాయక చర్యలపై జి హెచ్ ఎం సి యంత్రాంగంకు  పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు,చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ దిశానిర్దేశం  చేస్తున్నరు. కమీషనర్,  జోనల్ కమీషనర్లు,అదనపు కమీషనర్లు, డిప్యూటీ కమీషనర్లుసహాయక చర్యలను క్షేత్రస్థాయిలో తిరిగి  మానిటరింగ్ చేస్తున్నరు.


వరదతో రోడ్లు,నాలాల్లోకి కొట్టుకువచ్చిన చెత్త, చెదారం,భవన నిర్మాణ,శిధిల వ్యర్ధాల తొలగింపుకు  స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది.అంటువ్యాదుల నివారణ కై వరద ప్రభావిత ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి, యాంటీ లార్వా, సోడియం హైపో క్లోరైట్ క్రిమిసంహారకాలను ఎంటమాలజి, డి ఆర్ ఎఫ్.ఫైర్ సర్వీసెస్ సిబ్బంది స్ప్రే  డ్రైవ్ కూడా కొనసాగుతోంది


Advertisement
Advertisement
Advertisement