గ్రేటర్ లో భారీగా మిషన్ మోడ్ తో పారిశుధ్య కార్యక్రమాలు

ABN , First Publish Date - 2020-10-30T22:20:56+05:30 IST

నగరంలో పెద్ద ఎత్తున పేరుకుపోయిన చెత్తను, బురదను తొలగించడానికి 737 ప్రత్యేక వాహనాలను, అదనపు లేబర్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ముమ్మరంగా పారిశుధ్య కార్యక్రమాలను జీ.హెచ్.ఎం.సి చేపట్టింది.

గ్రేటర్ లో భారీగా మిషన్ మోడ్ తో పారిశుధ్య కార్యక్రమాలు

హైదరాబాద్ :  నగరంలో పెద్ద ఎత్తున పేరుకుపోయిన చెత్తను, బురదను తొలగించడానికి 737 ప్రత్యేక వాహనాలను, అదనపు లేబర్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ముమ్మరంగా పారిశుధ్య కార్యక్రమాలను జీ.హెచ్.ఎం.సి చేపట్టింది. దీని కోసం 2530 మంది కొత్తగా నియమించిన కార్మికులతో పాటు జీహెచ్చెఎంసీ కి చెందిన 23 వేల మంది పారిశుధ్య, ఎంటమాలజి సిబ్బంది ఈ మూమ్మర పారిశుధ్య కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నీటమునిగిన 235 కాలనీలలో, నగరంలోని ప్రధాన రహదారుల్లో పేరుకే పోయిన వ్యర్థాలు, బురదను మోత్తం తొలగించేందుకు రానున్న పదిరోజుల పాటు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే.టీ.ఆర్ ఆదేశించడంతో మిషన్ మోడ్ తో జె.హెచ్.ఎం.సి పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతోంది.


దీనితో పెద్ద ఎత్తున చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా 737 పలు రకాల వాహనాల్ని ఇందుకై వినియోగిస్తోంది. ఇప్పటికే జీహెచ్ ఎంసీ వద్ద ఉన్న 242 వాహనాలతోపాటు 495 కొత్తగా వాహనాలను ఏర్పాటుచేసింది. ఈ మొత్తం 737 వాహనాలలో  177 జె.సి.బీ లు, 26 బాబ్ కాట్, 258 టిప్పర్లు, 96 సిక్స్ టన్నర్లు, 126 పది టన్నర్లు, 44 ట్రాక్టర్లు నగరంలో ఇరవైనాలుగు గంటలూ పనిచేస్తున్నాయి. వీటికి తోడు, 334 పంపుల ద్వారా సెల్లార్లలో, కాలనీలో పేరుకుపోయిన నీటిని తొలగించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతొంది.ఇప్పటికే ఉన్న 1008 మంది వర్షాకాల అత్యవసర సిబ్బందితోపాటు ముమ్మరపారిశుధ్య కార్యక్రమాలకు అదనంగా 1522 మంది లేబర్ ను ప్రత్యేకంగా నియమించారు. అంటే, మొత్తం 22530 మంది నగరంలోని వరద పీడిత ప్రాంతాల్లో చెత్తను, బురదను తొలగించే కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. 

                 

నగరంలో చేపట్టిన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కు రూ. 5 , 51,94,400 లను ఇప్పటికే వ్యయం చేయగా, ఈ పదిరోజుల ఇంటెన్సివ్ స్పెషల్ డ్రైవ్ లో మరో ఆరు కోట్ల రూపాయల వరకు దీనికి జీహెచ్ఎంసీ వ్యయంచేయనుంది. ముఖ్యంగా తీవ్రంగా దెబ్బతిన్న కాలనీలపై ప్రత్యేక దృష్టితో ఈ శానిటేషన్ డ్రైవ్ ను చేపట్టారు. ఈ డ్రైవ్ లో రోజుకు దాదాపు పదివేల మెట్రిక్ టన్నుల అదనపు వ్యర్థాలను సేకరిస్తున్నారు. 


వర్షాల వల్ల తీవ్రంగా ప్రభావితమైన కాలనీలు, బస్తీల్లో కేంద్రీకృత ముమ్మర పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, అయితే, మీ కాలనీలు, బస్తీల్లో చెత్త, వ్యర్థాలుంటే సంబంధిత సర్కిళ్ల శానిటేషన్ అధికారికి నేరుగా ఫోన్ చేసి గాని, లేదా  9704601866 అనే నెంబరుకు వాట్సాప్ చేయాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే అనేక కాలనీల్లో వ్యర్థాలను పూర్తిగా తొలగించారు. ముఖ్యంగా సెల్లార్లలో నిండిన నీటిని  యుద్ధ ప్రాతిపదికన తొలగించారు.   ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేయాలని జీ.హెచ్.ఎం.సి ప్రకటించింది.


Updated Date - 2020-10-30T22:20:56+05:30 IST