హై అలర్ట్ ప్రకటించిన GHMC

ABN , First Publish Date - 2022-07-09T17:43:17+05:30 IST

భారీ వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ హై అలర్ట్ ప్రకటించింది. శుక్రవారం ఉదయం నుంచి గ్రేటర్‌ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది

హై అలర్ట్ ప్రకటించిన GHMC

Hyderabad: భారీ వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ(GHMC) హై అలర్ట్(high alert) ప్రకటించింది. శుక్రవారం ఉదయం నుంచి గ్రేటర్‌ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మోస్తరుగా కురిసిన వర్షం రాత్రి క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ఇక నగరంలో శనివారం కూడా వర్షం భారీగా కురుస్తుంది. ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసి హై అలర్ట్ ప్రకటించింది. శనివారం ముంపు ప్రాంతాల్లో నగర మేయర్ విజయ లక్ష్మి పర్యటించారు. ఈ నేపథ్యంలో రసూల్ పురా నాలాపనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడడంతో ఇంటి నుంచి ఆఫీసుల వెళ్లే ఉద్యోగులు వర్షంలో ఇబ్బందులు పడుతున్నారు. కార్లలో వెళ్లిన వారు గంటల తరబడి ప్రయాణించిన పరిస్థితి నెలకొంది. మరో మూడు, నాలుగు రోజులపాటు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-07-09T17:43:17+05:30 IST