Abn logo
Sep 24 2021 @ 17:11PM

బల్దియాకు 5 వేల కోట్లు: మేయర్ విజయలక్ష్మి

హైదరాబాద్‌: బల్దియా అభివృద్ధికి 5 వేల కోట్లను ప్రకటించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం, ఏజెన్సీ 60 శాతం భాగస్వామ్యంతో నగరంలో సీవరేజ్ ప్లాంట్ల నిర్మాణం, నిర్వహణ చేపడుతుందని మేయర్ పేర్కొన్నారు. రాబోయే 10 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని నిధులు ఇచ్చిన సీఎం కేసిఆర్‌కు విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.


నగరంలో 31 సీవరేజ్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నామని ఆమె పేర్కొన్నారు. ఇందుకు 3,800 కోట్లను కేటాయించారన్నారు. ఓఆర్ఆర్ పరిధిలో తాగునీటి అవసరాలకు 1200 కోట్లు కేటాయించారని మేయర్ తెలిపారు. రెండు ఏళ్లలో కొత్తగా చేపట్టనున్న మురుగునీటి శుద్ధి ప్లాంట్స్‌ను నిర్మిస్తామన్నారు. నగరంలో కొత్తగా 2,100 కిలోమీటర్ల నీటి పైప్ లైన్ వేయనున్నట్లు ఆమె తెలిపారు. నగరంలో 2 లక్షల కొత్త నీటి కనెక్షన్లను ఇస్తామని మేయర్ పేర్కొన్నారు. ప్రస్తుతం నగరంలో 9.8 లక్షల గృహాలకు ఉచిత తాగునీరు అందిస్తున్నామని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. 

ఇవి కూడా చదవండిImage Caption