Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ అధికారి విషయంలో జీహెచ్ఎంసీ మేయర్ తీసుకున్న నిర్ణయం ఇదీ..

  • ఆ అధికారి మాతృ సంస్థకు.. 
  • ఆపరేటర్‌ను వేధించిన స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌పై చర్యలు
  • మేయర్‌ ఆదేశాలతో కమిషనర్‌ నిర్ణయం

హైదరాబాద్‌ సిటీ : మహిళా ఉద్యోగిపై ఓ అధికారి అనుచితంగా ప్రవర్తించాడన్న ఫిర్యాదుపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ స్పందించారు. మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ఆదేశాలతో స్టాటిస్టికల్‌ అధికారి ఎం.శ్రీనివా‌స్‌ను మాతృసంస్థ వైద్య ఆరోగ్య శాఖకు పంపుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 6న శ్రీనివాస్‌ జీహెచ్‌ఎంసీలో రిపోర్ట్‌ చేయగా.. స్టాటిస్టికల్‌ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీని పర్యవేక్షించే ఆయన చార్మినార్‌ సర్కిల్‌లో పనిచేసే ఆపరేటర్‌ను వేధించాడనే ఆరోపణలున్నాయి. దీనిపై మహిళా ఉద్యోగి మేయర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన మేయర్‌ సదరు అధికారిని వెంటనే మాతృసంస్థకు పంపాలని ఆదేశించారు. ఈ మేరకు కమిషనర్‌ నిర్ణయం తీసుకున్నారు. శ్రీనివా‌స్‌పై వచ్చిన ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి తదుపరి చర్యల కోసం నివేదికను వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌కు పంపిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Advertisement
Advertisement