నిరూపిస్తే చెవి కోసుకుంటా.. : GHMC Mayor

ABN , First Publish Date - 2021-12-16T16:29:39+05:30 IST

నిరూపిస్తే చెవి కోసుకుంటా.. : GHMC Mayor

నిరూపిస్తే చెవి కోసుకుంటా.. : GHMC Mayor

  • అందర్నీ కలుపుకొని వెళ్తున్నా..
  • విజయలక్ష్మి గద్వాల

హైదరాబాద్ సిటీ : బీజేపీ కార్పొరేటర్లను తాను కలవడం లేదన్నది అవాస్తవమని, అది నిరూపిస్తే చెవి కోసుకుంటా అని మేయర్‌ గద్వాల విజయ లక్ష్మి అన్నారు. కార్పొరేటర్లందరికీ తాను అందుబాటులో ఉంటున్నానని చెప్పారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మేయర్‌ ఛాంబర్‌ను బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు ధ్వంసం చేయడాన్ని ప్రస్తావించగా, ఆమె ఇలా స్పందించారు. కార్పొరేటర్లకు అందుబాటులో ఉండడం లేదని ప్రచారం చేస్తున్నారని, అందుకే జోన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జోన్ల పర్యటన అనంతరం.. అధికారులు, కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించి వారి మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తానని అన్నారు. అందర్నీ కలుపుకొని వెళ్తున్నానని, శనివారం జరగబోయే కౌన్సిల్‌ సమావేశాన్ని మీరే చూస్తారన్నారు.



Updated Date - 2021-12-16T16:29:39+05:30 IST